జాగో స్టూడియో బ్యానర్ పై పి. నాయుడు నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన సినిమా కఠారి కృష్ణ. ఈ సినిమాకు డైరెక్టర్ ప్రకాష్ తిరుమల శెట్టి దర్శకత్వం వహించాడు. ఇక కృష్ణ, చాణక్య, నిరోషా యశ్న చౌదరి, స్వాతి మండల్ కీలక పాత్రల్లో నటించారు. అంతేకాకుండా పోసాని కృష్ణ మురళి, టి ఎన్ ఆర్, డి.ఎస్.రావు, చంద్రశేఖర్, మిర్చి మాధవి తదితరులు నటించారు. ఇక ఈ సినిమా విడుదల కాకముందుకే ట్రైలర్ ద్వారా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు భారీ అంచనాలు వెలువడ్డాయి. ఇక ఈ రోజు ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం.
కథ: ఈ సినిమా కథ అనేది ఒక స్కూల్లో పిల్లల మధ్య ర్యాంకు పోటీల నేపథ్యంలో రూపొందింది. ఇందులో ఎండి కృష్ణ భార్య గతం కోల్పోయి హాస్పిటల్ లో ఉంటుంది. దీంతో డాక్టర్ పోసాని కృష్ణమురళి సహాయంతో తన భార్య గతం పోవడానికి కారణమైన వ్యక్తులను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఓ సారి తన భార్య శ్రీవల్లి ఇంట్లో ఉండగా సత్య కృష్ణ మధ్య కాస్త గొడవ జరుగుతుంది. అయితే వేద, గాయత్రి, శ్రీవల్లి వాళ్లు చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు వారి మధ్య ర్యాంకు పోరు అలాగే ఉంటుంది. దాంతో సత్య, శ్రీవల్లి కలిసి వేదాలు చంపేస్తారు. దీంతో వేద ని చంపడానికి, శ్రీవల్లి గతం కోల్పోవడానికి, గాయత్రి పిచ్చిది అవ్వడానికి కారణమేంటో.. ఇదంతా ఎవరు చేశారో అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన: ఇందులో నటీనటుల నటన బాగా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరు తమ పాత్రలలో లీనమైయ్యారు.
టెక్నికల్: టెక్నికల్ పరంగా దర్శకుడు ఈ సినిమాను మంచి కథతో తెరకెక్కించాడు. కథకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకున్నాడు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం ఆకట్టుకుంది.
విశ్లేషణ: ముగ్గురు అమ్మాయిల మధ్య పోటీ తత్వం అనేది బాగా చూపించారు. ట్విస్ట్ లు బాగా ఆకట్టుకున్నాయి. అక్కడక్కడ రొమాంటిక్ సన్నివేశాలు, సీరియస్ సన్నివేశాలు కూడా బాగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్: సినిమా కథ, నటీనటుల నటన, మధ్యలో ట్విస్ట్ లు ప్లస్ పాయింట్స్ గా ఉన్నాయి.
మైనస్ పాయింట్స్: రికార్డింగ్, డి ఐ మిక్సింగ్ మైనస్ పాయింట్ గా నిలిచాయి.
బాటమ్ లైన్: కథ పరంగా సినిమా బాగా ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 3/5
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…