Featured

Manisha Koirala: రజనీకాంత్ కారణంగానే నా కెరియర్ ఇలా అయిపోయింది… మనీషా కొయిరాలా షాకింగ్ కామెంట్స్!

Manisha Koirala: భారతీయుడు, ఒకే ఒక్కడు క్రిమినల్ వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న అలనాటి హీరోయిన్ మనీషా కొయిరాలా గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు తమిళ్ హిందీ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన మనీషా ప్రస్తుతం హిందీలో సినిమాలలో నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల మీడియా ముందుకి వచ్చిన మనీషా రజినీకాంత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆయన వల్లే తన కెరీర్ నాశనం అయ్యిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం మనీషా కొయిరాలా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాబా సినిమాలో మనీషా కొయిరాలా రజనీకాంత్ తో కలిసి జంటగా నటించింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా మిగలటంతో ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయని తెలిపింది. దీంతో రజినీకాంత్ వల్లే తన సినీ జీవితం ముగిసిపోయింది అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాబా సినిమా రజనీకాంత్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్. ఈ సినిమాకు రజనీకాంత్ స్వయంగా కథ అందిస్తూ నిర్మించారు. ఆధ్యాత్మిక కోణంలో సాగే ఈ సినిమాకి సురేష్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. 2002లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది.

Manisha Koirala: బాబా సినిమా డిజాస్టర్ కావడమే…

ఇక ఈ సినిమా ప్లాప్ కావటంతో ఈ సినిమాలో నటించిన మనిషాకి కూడా తెలుగు తమిళ్ భాషలలో సినిమా అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత కొంతకాలానికి కమల్ హాసన్ తో కలిసి ముంబై ఎక్స్ప్రెస్ సినిమాలో నటించినది. అయితే ఆ సినిమా కూడా ప్లాప్ అవటంతో ఈమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అందువల్ల బాబా సినిమా వల్ల తన సినీ జీవితం నాశనం అయ్యింది అంటూ మనీషా వెల్లడించింది. అప్పుడు అట్టర్ ప్లాఫ్ గా నిలిచిన బాబా సినిమా ఇటీవల రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పాదాల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఇది విటమిన్ లోపం హెచ్చరిక కావచ్చు!

మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…

21 hours ago

బెండకాయలో దాగిన హెల్త్ పవర్… షుగర్ కంట్రోల్‌కు సూపర్ ఫుడ్!

వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…

21 hours ago

ఇంట్లో ఈ మూలలో నీళ్లు పెడితే… డబ్బు ప్రవాహం ఆగదు అంటున్నారు!

ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…

21 hours ago

రోజూ పిస్తా తింటున్నారా? ఈ లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యమే!

రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…

21 hours ago

చేతులు చూస్తేనే తెలిసిపోతుంది… మీ కొలెస్ట్రాల్ స్థాయి!

మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…

21 hours ago

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు… శ్రీశైలంలో చలివేంద్రాల ఏర్పాటు!

ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…

21 hours ago