Manisha Koirala: భారతీయుడు, ఒకే ఒక్కడు క్రిమినల్ వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న అలనాటి హీరోయిన్ మనీషా కొయిరాలా గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు తమిళ్ హిందీ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన మనీషా ప్రస్తుతం హిందీలో సినిమాలలో నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల మీడియా ముందుకి వచ్చిన మనీషా రజినీకాంత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆయన వల్లే తన కెరీర్ నాశనం అయ్యిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం మనీషా కొయిరాలా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాబా సినిమాలో మనీషా కొయిరాలా రజనీకాంత్ తో కలిసి జంటగా నటించింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా మిగలటంతో ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయని తెలిపింది. దీంతో రజినీకాంత్ వల్లే తన సినీ జీవితం ముగిసిపోయింది అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాబా సినిమా రజనీకాంత్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాకు రజనీకాంత్ స్వయంగా కథ అందిస్తూ నిర్మించారు. ఆధ్యాత్మిక కోణంలో సాగే ఈ సినిమాకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. 2002లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది.
Manisha Koirala: బాబా సినిమా డిజాస్టర్ కావడమే…
ఇక ఈ సినిమా ప్లాప్ కావటంతో ఈ సినిమాలో నటించిన మనిషాకి కూడా తెలుగు తమిళ్ భాషలలో సినిమా అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత కొంతకాలానికి కమల్ హాసన్ తో కలిసి ముంబై ఎక్స్ప్రెస్ సినిమాలో నటించినది. అయితే ఆ సినిమా కూడా ప్లాప్ అవటంతో ఈమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అందువల్ల బాబా సినిమా వల్ల తన సినీ జీవితం నాశనం అయ్యింది అంటూ మనీషా వెల్లడించింది. అప్పుడు అట్టర్ ప్లాఫ్ గా నిలిచిన బాబా సినిమా ఇటీవల రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.