Featured

Mr. Tea Naveen reddy vaishali issue : వైశాలి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్టులు… నిజాలు బయటపెట్టిన కాంగ్రెస్ నేత బి ఏం రెడ్డి….!

Mr Tea Naveen Reddy Vaishali issue : రంగారెడ్డి జిల్లా అధిభట్లలో జరిగిన ఒక కిడ్నాప్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా లెవెల్లో వందమంది తో వచ్చి ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన వారిని కొట్టి ఆ ఇంటివద్ద సీసీ కెమెరాలను ధ్వంసం చేసి నానా హంగామా చేసి యువతీని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. కానీ ఈ కిడ్నాప్ విషయంలో లోతుకి వెళితే అక్కడే మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇక కిడ్నాప్ చేయించిన నవీన్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. దౌర్జన్యంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసారని తోలుత భావించినా నిజానికి ఆ అమ్మాయికి నవీన్ రెడ్డి కి అంతకుముందు చాలానే జరిగిందని బయట ప్రచారం జరుగుతోంది. అసలు జరిగిన విషయాలలో ఇంకా క్లారిటీ రావాల్సిన ఉండగా వైశాలి కుటుంబానికి సన్నిహితులైన కాంగ్రెస్ లీడర్ బిఏం రెడ్డి గారు జరిగిన ఇష్యూ గురించి మాట్లాడారు.

నవీన్ ఒక జులాయి…. పోలీసులా నిర్లక్ష్యమే కారణం….

వైశాలి ఇంటికి వచ్చి ఆమెను కిడ్నాప్ చెసి తీసుకెళ్లిన నవీన్ రెడ్డి గురించి బయటకు రోజుకో కథనం వస్తున్న నేపధ్యంలో బిఏం రెడ్డి గారు మాట్లాడుతూ నవీన్ కు వైశాలి షెటల్ ఆడటానికి వెళ్ళినపుడు పరిచయం అయింది. ఈ అమ్మాయి స్నేహంగా ఉంటే నవీన్ దాన్ని తప్పుగా అనుకుని ఆ అమ్మాయి వెంట పడ్డాడు. ఇక ఇంట్లో వాళ్లకు ఒకే సామాజిక వర్గం కదా పెళ్లి చేయండని కొంతమంది సలహాలు ఇచ్చారు. నవీన్ రెడ్డి గురించి వాకబు చేస్తే అతని రెండు మూడేళ్ళ నుండే వ్యాపారం లో బాగా ఎదిగాడు.

అంతకుముందు జులాయి గా తిరుగుతూ ఉండేవాడు అని తెలిసీ వైశాలి కుటుంబం వాళ్ళు వద్దన్నుకున్నారు. ఇక ఆ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయాలనీ అనుకున్నపుడు నవీన్ కి విషయం తెలిసీ ఇలా చేసాడు. అంతకు ముందే పోలీసులను నారాయణ రెడ్డి ఆశ్రయించిన పోలీసులు సరిగా స్పందించలేదు. నవీన్ తన దగ్గర పనిచేసే ఒక నూరు మంది బీహార్ వాళ్ళను తీసుకోచ్చి గొడవ చేసాడు అంటూ బి ఏం రెడ్డి గారు ఆయన అభిప్రాయాలను తెలిపారు.

Bhargavi

Recent Posts

నీళ్లు మాత్రమే కాదు… బార్లీ నీరు తాగితే డబుల్ బెనిఫిట్!

వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లగా ఉంచడం, నీటి లోపాన్ని నివారించడం అత్యంత అవసరంగా మారుతోంది. ఈ సమయంలో…

2 hours ago

వేడి నుంచి రక్షణ… కర్బూజా ఎందుకు ‘సమ్మర్ సూపర్ ఫుడ్’?

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న కొద్దీ శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో దాహాన్ని తీరుస్తూ, శరీరానికి చల్లదనం…

2 hours ago

ఒక్క అడుగు కాదు… ప్రతి అడుగు నమస్కారం! అమర్నాథ్ యాత్రలో అరుదైన ఘటన!

దేశవ్యాప్తంగా శివభక్తి గురించి చర్చ జరుగుతున్న వేళ, ఇద్దరు భక్తుల అసాధారణ సంకల్పం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంచు కొండల…

2 hours ago

తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్… సామాన్య భక్తులకు గుడ్ న్యూస్!

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…

2 hours ago

దశాబ్దాల సంప్రదాయం నిలిచిపోయింది… వెంకటరమణ స్వామి కళ్యాణంపై వివాదం!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి ఆలయానికి సంబంధించిన వార్షిక…

3 hours ago

అవమానంగా భావించి అడ్వాన్స్ తిరిగి ఇచ్చా..‘మిధునం’పై నటుడి షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ రంగంలో రచయితగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బీ. శ్రీరామ్ తాజాగా తన కెరీర్‌లో ఎదురైన ఒక…

4 hours ago