Featured

Mucherla Aruna : మగబిడ్డ పుట్టలేదని అత్తింట్లో వాళ్ళు అలా చేసారు…. ప్రతి ఇంట్లో ఉండేదే అంటూ అరుణ షాకింగ్ కామెంట్స్….!

Mucherla Aruna : సీనియర్ నటి ముచ్చర్ల అరుణ దక్షిణాది అన్ని భాషలలోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పుట్టింది. హైదరాబాద్ లో చదువు పూర్తిచేసి మ్యూజిక్ అకాడమీలో డాన్స్ నేర్చుకుంటున్న సమయంలో లెజెండరీ దర్శకుడు ఇళయరాజా దర్శకత్వంలోని సీతా కొక చిలుక సినిమా అవకాశం వచ్చింది. కార్తీక్, అరుణ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తరువాత అరుణ ఇక వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హీరోయిన్ గా తెలుగులో 36, తమిళంలో 24, మలయాళంలో 14, కన్నడలో 3 సినిమాలు చేసింది. 16ఏళ్లకే సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అరుణ 1990 లో మోహన్ గుప్తా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన అరుణ కుటుంబ బాధ్యతలతో జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక అరుణ మోహన్ గుప్తాలకు నలుగురు ఆడపిల్లలు. ఎపుడు మీడియాకి కానీ ఇంకెక్కడా కనిపించని అరుణ చాలా రోజుల తరువాత యూట్యూబ్ చానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. తన పిల్లలు ప్రస్తావన వచ్చినపుడు ఎందుకు నలుగురు ఆడపిల్లలు అన్న ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. మొదటిసారి ఆడపిల్ల పుట్టినపుడు తన అత్త గారూ సంతోషంగా లేరని మగబిడ్డ అయితే బాగుండు అన్నారట. ఇక రెండో బిడ్డ మూడు ఆడపిల్ల పుట్టేసరికి అరుణ తల్లి గారు కూడా బాధ పడ్డారట.

నాలుగోసారి ఆడపిల్ల అనేసరికి అందరూ ఏడ్చేశారు అంటూ ఎప్పటి విషయాన్నీ చెప్పారు రతి ఇంట్లో ఉండే విషయమే ఒక్క మగబిడ్డయినా ఉండాలని కోరుకుంటారు అంటూ చెప్పారు. ఇక ఆడపడుచు ఒక పాపను దత్తత తీసుకోవాలని భావించినా తనకు తన భర్త కు ఆడపిల్ల మగపిల్లాడు అనే భేదం లేదని మేము మా పిల్లలు విషయంలో ఆనందంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇక పిల్లలు పై చదువులు చదివి బాగా సెటిల్ అవుతున్నారని, సర్వీస్ చేయడానికి ఆసుపత్రులు నిర్మించాలనుకుంటున్నట్లు మనసులోని మాటను చెప్పారు.

Bhargavi

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

2 days ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

2 days ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

2 days ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

2 days ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

2 days ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

2 days ago