Balakrishna : బాలయ్య బాబుకి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చింది. అటు ఆహా ఒరిజినల్స్ లో అన్ స్టాపబుల్ గా రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక ఎటు మరోసారి బోయపాటి బాలయ్య కాంబినేషన్ తో హిట్ కొట్టాడు. అఖండ సినిమాలో డ్యూయల్ రోల్ తో అదరగొట్టిన బాలకృష్ణ అఘోర పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సనాతన ధర్మాన్ని కాపాడాలనే కాన్సెప్ట్ తో హిందూ ఆచారాలు, దేవుళ్ళు, దేవాలయాల గురించి చక్కగా సినిమాలో వివరించారు.
ఇక అఖండ సినిమా విడుదలైన అన్ని థియేటర్లలోనూ మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సినిమా 50 రోజులు ఆడడం చాలా గొప్ప విషయం అలాంటిది అఖండ ఏకంగా 175 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. గుంటూరు లోని రామకృష్ణ థియేటర్ లో సినిమా 175 రోజులు పూర్తి చేసుకుంది. ఓటీటీ లో కూడా విడుదలయి సంచలనం సృష్టించిన అఖండ థియేటర్లో అన్ని రోజులు ఆడడం గొప్ప విషయం సినిమాకు ప్రేక్షకాదరణ తగ్గకపోవడంతో సినిమాను అలాగే కొనసాగించామని థియేటర్ యాజమాన్యం వివరించింది.
ఇప్పటికే ప్రాంతీయ సినిమాల్లో ఈ ఏడాదికి సౌత్ సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది అఖండ సినిమా. ఇక ఇపుడు మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇక అఖండ సినిమాకు సీక్వేల్ ఉంటుందని బోయపాటి చెప్పారు. కాని ప్రస్తుతం బోయపాటి రామ్ పోతినేని తో సినిమాకు సిద్ధమయ్యారు. ఇక బాలకృష్ణ గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…