Music Director Koti : దాసరిగారితో గొడవ జరిగి… మొహం కూడా చూసుకోలేని పరిస్థితి వచ్చింది… చివరికి ఆయన చనిపోతే కూడా వెళ్ళలేదు…: సంగీత దర్శకుడు కోటి

Music Director Koti : మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి గా ఇండస్ట్రీలోకి మ్యూజిక్ తోనే అడుగుపెట్టిన కోటి మొదట్లో రాజ్ తో కలిసి రాజ్ కోటి గా ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఇద్దరూ విడిపోయి ఎవరికి వారు సినిమాలను చేసిన రాజ్ కోటి ధ్వయం ఆ తరువాత కూడా సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక కోటి చిరంజీవి, బాలకృష్ణ వంటి అందరు అగ్ర హీరోలకూ మ్యూజిక్ చేస్తూ ఎన్నో హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడం వల్ల గ్యాప్ తీసుకున్న కోటి గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో దాసరి నారాయణ రావు గారితో ఉన్న అనుబంధం గురించి వివరించారు.

గొడవతో ఇద్దరం మొహం చూసుకోలేదు…

దాసరి గారి ప్రతి సినిమాకు కోటి గారు మ్యూజిక్ చేసారు. దాసరి నారాయణ రావు గారు కోటి తండ్రి సాలూరి రాజేశ్వరరావు గారితో పనిచేసినపుడు కూడా కోటి గారిని చాలా ప్రేమగా మాట్లాడించేవారట. అలాంటి దాసరి గారికి పక్కన ఉన్న వాళ్ళు కోటి గురించి తప్పుగా చెప్పడం వల్ల శ్రీహరి గారితో తీసిన ‘మేస్త్రి’ సినిమా తరువాత సినిమా చేయలేదట.

కారణాలు పెద్దగా తెలియదు కానీ ఆయన నన్ను దూరం పెట్టాడు అంటూ కోటి గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక మళ్ళీ దాసరి గారు ఆయన సినిమాల్లో కోటి గారిని తీసుకోలేదట. ఇక మళ్ళీ దాసరి గారితో మాట్లాడటం కానీ, కలవడం కానీ జరగలేదని కోటి గారు తెలిపారు. చనిపోయినపుడు కూడా అమెరికాలో ఉండటం వల్ల రాలేకపోయాను, చివరిసారిగా చూడలేక పోయాను, ఆయన నా కెరీర్ లో నన్ను చాలా ప్రోత్సాహించిన వారిలో ఒకరు అంటూ తెలిపారు.