పోసానికి విపరీతమైన కోపం..! ఫోన్ లిఫ్ట్ చేయడం రెండు సెకండ్లు లేట్ అయినా.. ఎం.ఎం. శ్రీలేఖ..

టాలీవుడ్ లో ఏకైక లేడీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీ లేఖ‌. ఎం.ఎం. కీర‌ణ‌వాణి చెల్లెలుగా ఎంట్రీ ఇచ్చిన శ్రీలేఖ ఇప్ప‌టివ‌ర‌కూ చాలా సినిమాల‌కు సంగీతం అందించారు. ఆమె ఒక్క తెలుగులోనే కాకుండా దక్షిణ భారతదేశంలోని హిందీ, తమిళ, మళయాలం, కన్నం వంటి భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ హీరోగా తాజ్ మహల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దీనిని డా. డి. రామానాయుడు నిర్మించారు. దీనిలో సంగీత దర్శకురాలిగా శ్రీలేఖ పనిచేశారు. ఆ తర్వాత శివయ్య, ప్రేయసి రావే.. ఆపరేషన్ దుర్యోదన వంటి 70కి పైగా సినిమాలకు బాణీలను అందించారు శ్రీలేఖ. అయితే ఆమె తాజాగా పోసానీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆమె ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పోసానీ కృష్ణ మురళికి కోపం ఎక్కువగా ఉంటుందని.. తొందర్లో టపటపా మాట్లాడేసి.. తర్వాత కూల్ అవుతారని చెప్పుకొచ్చారు. ఒక సాంగ్ కంపోజ్ చేయడం లేట్ అయిందంటే.. ఎందుకు.. ఏమైందటూ ఆవేశ పడతారాని.. తెలిపారు. కాల్ చేసిన రెండో రింగ్ కు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే.. అతడికి కోపం విపరీతంగా వస్తుందని శ్రీలేఖ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అతడు మంచి విజన్ ఉన్న దర్శకుడు అని.. ఎలాంటి టెన్షన్ లేని సమయంలో ‘రాజా’ అంటూ సంబోధిస్తారని చెప్పారు. కోపం వచ్చినా కేవలం తాత్కాలికంగా ఉంటుందని.. తదుపరి సెకన్లో అన్నీ మర్చిపోతారని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో పోసానీతో కలిసి ఓ సినిమాలో వర్క్ చేసినట్లు.. ఆ సినిమా పేరు ‘ముఖ్యమంత్రి గారు మీరు మాటిచ్చారు’అని చెప్పారు. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదని ఆమె అన్నారు.