Cinematographer MV Raghu : ఫైట్ మాస్టర్ కి స్టార్ హోటల్.. నాకు మాత్రం గెస్ట్ హౌస్ లో ఒక మూలన ఇచ్చారు.. ఇదేంటని మోహన్ బాబుని అడిగితే…. ఏమన్నారో తెలుసా ?! : సినిమాటోగ్రాఫర్ ఏం.వి. రఘు

MV Raghu : సినిమాటోగ్రాఫర్ గా ‘కళ్ళు’ సినిమాతో మంచి గుర్తింపునే కాకుండా, అవార్డులు కూడా తెచ్చుకున్న, భీమవరానికి చెందిన ఎమ్ వి రఘు చాలా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసారు. కోదండ రామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య, కే విశ్వనాధ్ వంటి ప్రముఖ దర్శకులకు వర్క్ చేసిన ఆయన మోహన్ బాబు సినిమాలకు వరుసగా పని చేసి ఆ తరువాత మానేశారు. ఇక కే విశ్వనాధ్ గారితో కూడా గొడవ జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలపై స్పందించారు.

అకామిడేషన్ విషయంలో మోహన్ బాబు అలా అన్నారు….

డిటేక్టివ్ నారద సినిమా నుండి రాయుడు సినిమా వరకు వరుసగా ఆరు సినిమాలకు రఘు సినిమాటోగ్రాఫర్ గా పని చేసారు. అయితే మోహన్ బాబు ఒక అగ్నిపర్వతం లాంటి వాడని వేరే ఎవరిపైన అయినా కోపం ఉన్నా అది సెట్లో అందరిపైనా ప్రభావం పడుతుందని దానివల్ల నేను చాలా ఒత్తిడికి గురయ్యేవాడినని చెప్పారు. ఇక ఒక సినిమా షూటింగ్ సమయంలో ఫైట్ మాస్టర్ కి స్టార్ హోటల్ లో అకామిడేషన్ ఇచ్చి నాకు మాత్రం వసతులు సరిగా లేని రూమ్ ఇచ్చారు. నేను వెళ్లి మోహన్ బాబు గారిని ఇదేమిటని అడిగితే ఆయన నన్నే అడుగుతావా అంటూ మాట్లాడారు.

నేను సైలెంట్ గా వచ్చేసాను కానీ అదేమంత పెద్ద వివాదం కాదు. కానీ ఆయన సినిమా టైములో నేను బాగా ఒత్తిడికి లోనవుతుండడంతో నా కుటుంబం ఇక ఆయన సినిమాలకు పనిచేయవద్దని చెప్పడంతో మానేశానని చెప్పారు. ఇక కే విశ్వనాధ్ వంటి దిగ్గజ దర్శకుడితో సిరివెన్నెల, స్వాతి ముత్యం సినిమాలకు పని చేసిన ఆయన ఎందుకు కొనసాగించలేదనే ప్రశ్నకు గొడవలేవి లేవని చెబుతూనే, నా అసిస్టెంటులకు భోజనం పెట్టకపోవడంతో వారిని బయటకు పంపేవాడినని ఈవిషయంలో కే విశ్వనాధ్ గారికి నాకు విబేధాలు వచ్చాయని అయితే డైరెక్టుగా వివాదం రాలేదు కావాలని మధ్యలో ఉన్న వాళ్లే ఇలా గ్యాప్ పెంచారని చెప్పారు.