RGV : బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఎక్కడైనా ఆర్జీవి అనగానే వివాదాలతో బ్రతికే వాడని అంటారు. తనకంటే పబ్లిసిటీ గురు మరొకరు ఉండరని చెబుతారు. తనని తాను ప్రమోట్ చేసుకోవడంలో ఆర్జీవి కి ఉన్న టాలెంట్ ఇంకెవరికీ లేదు. ఇక ఆయన తీసిన చాలా చిత్రాలు సాంకేతికంగా, కథ పరంగా, టేకింగ్ పరంగా సూపర్ గా ఉంటాయి. చాలా మంది దర్శకులకు సినిమాలు తీయడంలో గురువు. ఇక ఆయన ఏ విషయం చెప్పినా వింతగాను కొత్తగాను ఉంటాయి. చాలా మందికి నచ్చని విషయాలను ఈయన చాలా బోల్డ్ గా చెప్పేస్తారు.
అమితాబ్ బచ్చన్ అమ్మ చనిపోయినపుడు నేను వెళ్లి జోక్స్ చెప్తే ఆయన రియాక్షన్…..
నాకు చావంటే అసలు నచ్చదని, రోగాలు రావడం, చనిపోవడం వంటి విషయాలు నాకస్సలు నచ్చని విషయాలు అని చెప్పారు. మా నాన్న మరణించినపుడు కూడా నేను అంత్యక్రియ్యలకు ఎవరినీ రానివ్వలేదు అందరు వచ్చి ఏడ్చటం నాకు నచ్చదు. మ నాన్న ఫోటో కూడా నేను ఇంట్లో పెట్టనివ్వలేదు. ఎందుకంటే పోయిన వారిని తలచుకోవడం బాధపడటం నాకు నచ్చదని చెప్పారు. అలానే అమితాబ్ బచ్చన్ వాళ్ళ అమ్మ చనిపోయినపుడు అందరూ పరామర్శకు వెళ్లారు నేను వెళ్ళలేదు. ఆ సంఘటన తరువాత కొన్నిరోజులకు నేను అమితాబ్ బచ్చన్ గారి ఇంటికి వెళ్లి అక్కడున్న వాళ్ళకి జోక్స్ చెప్పాను కానీ ఆయనకు నా గురించి తెలుసు కాబట్టి మామూలుగా తీసుకున్నారు.
నేను ఎవరికీ ఇది చేయమని చెప్పను. వారికి నచ్చితే వాళ్లు చేయొచ్చు. డైరెక్టర్ తేజ నా గురించి ఒక మాట అంటాడు, గుర్రం మొహం చూడని వాడికి గుర్రపు స్వారీ నీకు వచ్చు గుర్రం ఎక్కు అని చెప్పగల టాలెంట్ ఉందని అంటాడు. దేవుళ్ళపై నమ్మకం లేదని, దయ్యాలంటే ఇష్టమని చెప్పారు. జీవితంలో ఒక సారి ఒక 20 సెకన్లు మాత్రం చాలా భయపడ్డానని చెప్పారు. ఇక ఎప్పుడు జీవితంలో భయపడలేదని చెప్పారు. తనని తాను ఒక రొమాంటిక్ యోగి అంటూ చెప్పుకున్నారు రామ్ గోపాల్ వర్మ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…