భర్త నుంచి విడాకులు కావాలంటూ హిందీ నటి అర్జూ గోవిత్రికర్ నిర్ణయం తీసుకుంది. భర్త సిద్ధార్థ్ శబర్వాల్ పెట్టే వేధింపులు, హింసను భరించలేకపోతున్నానని వాపోయింది. ఆమె అతడిపై 2019 లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు తనలో మార్పు వస్తుందేమోనని నమ్మకంతో కాపురం చేసింది. కానీ అతడిలో ఏ మాత్రం మార్పురాక పోగ మరింత హింసకు పాల్పడుతుండటంతో విడిపోవడానికే నిశ్చయించుకుంది. ఈ సందర్భంగా ఆమె విలేకురుల సమావేశంలో మాట్లాడుతూ.. తాను నిజంగానే విడాకుల కోసం దరఖాస్తు చేశానని చెప్పింది.
ఇప్పటి వరకు తాను పడ్డ బాధలు చాలు.. ఇక నుంచి ఆ వేధింపులను భరించలేనంటూ..సిద్దార్థ్‌తో కలిసుండటం సాధ్యపడదంటూ ఆమె చెప్పారు. తమ మధ్య పెరుగుతున్న దూరం గురించి నేనెప్పుడూ మీడియాతో మాట్లాడలేదు. కానీ ఈరోజు మాట్లాడి తీరతాను అంటూ ధైర్యంగా చెప్పింది. సిద్ధార్థ్ ఆమెను ఇంట్లో నుంచి మెడ పట్టుకొని భయటకు నెట్టేందుకు ప్రయత్నించాడని.. తనపై చేయి కూడా చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. కట్టుకున్నదాన్ని అని చూడకుండా కడుపులో తన్నాడు. అంతెందుకు, నన్ను విచక్షణారహితంగా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి.
కానీ నేనెప్పుడూ ఆ గాయాలను బయటకు చూపించాలనుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లి అయిన రెండేళ్ల తర్వాత తనను కొట్టినట్లు ఆమె చెప్పింది. కొడుకు పుట్టిన మూడు సంవత్సరాల తర్వాత అతడు వేరే గదిలో పడుకుంటున్నాడని ఆమె చెప్పింది. అతడికి రష్యన్ ప్రియురాలు ఉన్నట్లు ఆమె చెప్పింది.
అతడు ఒంటరిగా ఆ గదిలో ఆమెతో చాటింగ్ చేస్తున్నాడని అర్థమైంది. ఇదే విషయాన్ని నేరుగా అతడి దగ్గరకు వెళ్లి నిలదీశాను, కానీ ప్రయోజనం లేకపోయిందని ఆమె విలేకురులకు చెప్పింది. వాళ్లు కలిసి ఉంటున్నారా.. లేదా విడి విడిగా ఉంటున్నారా అనేది తనకు తెలియదని చెప్పింది.
తన భర్త చేసిన చాటింగ్ లు.. తనపై దాడి చేసిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు మాత్రం తన దగ్గర ఉన్నట్లు చెప్పింది. ఈ ఆధారాలు తనను కాపాడతాయని నమ్ముతున్నట్లు ఆమె చెప్పింది. తనను కులం పేరుతో కూడా ఎన్నో సార్లు దూషించాడని తన భర్తపై ఆరోపణలు చేసింది. వీటిపై సిద్దార్థ్ స్పందిస్తూ.. ఈ విషయంపై మాట్లాడాలని తనకు లేదని.. ఆమెకు ఏం కావాలో అది చెప్పినివ్వండంటూ పేర్కొన్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…