Nagababu: మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పొలిటికల్ కామెంట్స్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావనకు తీసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అభిమానులు అందరూ గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు దీంతో నాగబాబు ఇంకా గట్టిగా అరవండి ఈ అరుపులు వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి అంటూ ఈయన కామెంట్లు చేశారు.
తాను ఇప్పుడే పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఇక్కడికి వస్తున్నానని తెలిపారు. ఇలా నాగబాబు మాట్లాడుతూ ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం వారి అరుపులు మానలేదు దీంతో నాగబాబు మాట్లాడుతూ ఈ ఎనర్జీ మొత్తం మీరు ఓట్లు వేయడంలో కూడా చూపించండి అంటూ ఈయన చేసినటువంటి పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ ఎనర్జీ ఓట్లు వేయడంలో ఉండాలి..
ఇకపోతే నాగబాబు ఈసారి జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. జనసేన టిడిపి కూటమి కలసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి. అయితే జనసేనకు 24 ఎమ్మెల్యే సీట్లతో పాటు మూడు ఎంపీ సీట్లను కేటాయించారని తెలుస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…