Nara Lokesh: పదో తరగతి విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన లోకేష్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వంశీ, కొడాలి నాని..!

Nara Lokesh: పదో తరగతి విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన లోకేష్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వంశీ, కొడాలి నాని..!

Nara Lokesh: టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పదవ తరగతి విద్యార్థులతో రోజు మీటింగ్ నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ లో విడుదలైన పదో తరగతి ఉత్తీర్ణత ఫలితాలు చూసిన అనంతరం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది అంటూ టీడీపీ ప్రభుత్వం అధికార పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం కోసం లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.

Nara Lokesh: పదో తరగతి విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన లోకేష్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వంశీ, కొడాలి నాని..!
Nara Lokesh: పదో తరగతి విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన లోకేష్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వంశీ, కొడాలి నాని..!

ఈ విధంగా పలువురు విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ మీటింగ్ లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. వల్లభనేని వంశి ఆఫీస్ నుంచి ఒక విద్యార్థి ఈ జూమ్ మీటింగుకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే వంశీ చాలా సులభంగా ఈ జూమ్ మీటింగ్ లో కనిపించారు.

Nara Lokesh: పదో తరగతి విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన లోకేష్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వంశీ, కొడాలి నాని..!

ఈ విధంగా వంశీ కనిపించిన కొంత సమయానికి మాజీ మంత్రి కొడాలి నాని కూడా కనిపించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. ఈ విధంగా విద్యార్థులతో నిర్వహిస్తున్న జూమ్ మీటింగులో ఈ విధంగా వైఎస్సార్ సీపీ నేతలు కనిపించడంతో ఒక్కసారిగా టిడిపి శ్రేణులు వీరు వ్యవహారశైలిపై భగ్గుమంటున్నారు. నాని వంశీ ఈ విధంగా లోకేష్ తో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో వీరికి సంబంధించిన లైన్స్ కట్ చేశారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు.

పదోతరగతి విద్యార్థులలో మానసిక స్థైర్యం నింపడం కోసం లోకేష్ ఈ విధంగా జూమ్ మీటింగ్ నిర్వహించగా ఇలా వైసీపీ నేతలు అడ్డుకుంటూ వెకిలి నవ్వులు నవ్వుతూ వారి శాడిజం బయటపెట్టారు అంటూ టిడిపి శ్రేణులు వీరి వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వీరు ఇలా జూమ్ మీటింగ్ లో కనిపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వీరు వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేశారు.