NTR : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించిన తారక్… సంచలనంగా మారిన ట్వీట్..!

NTR : హెల్త్ యూనివర్సిటీ పేరుని ఎన్టీఆర్ కి బదులుగా వైస్సార్ అని పెట్టడంతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు టీడీపీ శ్రేణులలో నిరసనలు వెళువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ పేరు మార్పు అత్యంత హేయమైన చర్యగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అంతేకాకుండా గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పోరాడతామని హెచ్చరించారు. మరో వైపు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా అసహనం వ్యక్తం చేస్తూ నందమూరి రామకృష్ణ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసి ఎన్టీఆర్ పేరును మార్చాకూడదు అని డిమాండ్ చేశారు.

ఇలా చేయడం వలన ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు…

వైస్సార్సీపీ కూడా ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత కూడా టీడీపీ కి లేదని గట్టిగా ఎదురుదాడికి దిగింది. ఇలా మాటల యుద్ధంతో ఏపీ లో రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై ఇంటిలిజెంట్ గా స్పందించారు. ‘NTR, YSR ఇద్దru విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’ అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

అయితే వివాదాలకు తావు ఇవ్వకుండా తనదైన శైలిలో తారక్ చాలా ఇంటెలిజెంట్ గా స్పందించారు అని అనుకుంటున్నట్టు సమాచారం. గతంలో కూడా ఇలాగే తారక్ వివాదాలకు స్థానం కల్పించకుండా స్పందించారు. మరోవైపు బీజేపీ, జనసేనలతో పాటు ఇతర పార్టీలు కూడా వైస్సార్సీపీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.