Inaya Sulthana : తెలుగు బిగ్ బాస్ మొదలైంది.. గొడవలు, కాంట్రవర్సీలు, బూతులు తిట్టుకోవడం, ఫన్ అలాగే ఎమోషన్స్ అన్నీ బాగా పండిస్తూ జనాలను ఎంటర్ టైన్ చేస్తోంది బిగ్ బాస్ షో. ఇక రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో నాగార్జున క్లాస్ పీకిన తరువాత కంటెస్టెంట్లు యమ యాక్టీవ్ అయ్యారు. ఇక కెప్టెన్సీ కంటెండర్ టాస్కులో రెచ్చిపోయారు. మీద పడి కొట్టేనసుకుని కొంతమందికి గాయాలు అయ్యేంతగా ఆడారు గేమ్. ఇక వాదనలు, తిట్లు అన్నీ పక్కన పెడితే ఇనయ సుల్తానా నా డ్రెస్ అందరూ గుంపుగా చేరి లాగారు అంటూ ఆరోపించింది. ఇది ఎపిసోడ్ కి హైలైట్.
అందరూ కలిసి నా డ్రెస్ లాగారు.. అబ్బే అదేం కాదు అంటున్న గీతూ…
అడవిలో ఆట టాస్కు సందర్బంగా పోలీసులు, దొంగలు అంటూ ఇంటి సభ్యులను విడగొట్టారు. ఇక వీళ్ళ రచ్చ మామూలుగా లేదు. ఇక టాస్క్ లో స్వార్థ పరురాలైన వ్యాపారిగా గీతూ ఆడి కెప్టెన్సీ కంటెండర్ అయింది. ఇక ఉత్తమ ప్రదర్శనతో శ్రీసత్య కూడా కెప్టెన్సీ కంటెండర్ అయింది. ఇక ఇనయ చేసిన రచ్చ మామూలుగా లేదు. పోలీస్ గా ఉన్న ఇనయా మొదట రేవంత్, శ్రీహన్ తో గొడవకు దిగింది.
ఇక రైడ్ కి వెళ్లాల్సిన ప్లేసులోకి కాకుండా లగేజ్ రూమ్ కి వెళ్లి రైడ్ చేస్తే అక్కడకి దొంగలందరూ వచ్చి ఆమెను వెళ్లకుండా నిలువరించారు. ఇక ఆమెను ఏకంగా కిడ్నాప్ చేసి గదిలో బందించారు. ఇక ఇనయ గుంపుగా వచ్చి తన మీద ఎటాక్ చేసారని, నా డ్రెస్ లాగరంటూ వాదించింది. ఇక దీనికి గీతూ గుంపుగా అందరూ వచ్చి పట్టుకున్నారు కానీ డ్రెస్ లాగలేదు అని వివరించింది. ఆరోహి, నేహా చౌదరి లను ఇనయా కొట్టిందని వారు ఆరోపించారు. మొత్తానికి బిగ్ బాస్ లో నాగార్జున పీకిన క్లాస్ కి రచ్చ మొదలయింది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…