మన దేశంలో 15,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం వేతనం తీసుకునే ఉద్యోగులతో పోలిస్తే 15,000 రూపాయల కంటే తక్కువ మొత్తం వేతనం తీసుకునే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. తక్కువ మొత్తం వేతనం పొందుతున్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ అనే పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం రిటైర్మెంట్ తర్వాత ప్రయోజనం పొందాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సాధారణంగా సంఘటిత రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లభిస్తుంది. అయితే అసంఘటిత రంగంలో పని చేసే వాళ్లకు ఎలాంటి పెన్షన్ లభించదు. ఇలా పెన్షన్ పొందలేని వారికి పెన్షన్ పొందే అవకాశం కల్పించడానికి కేంద్రం ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్ ధన్ పథకం అమలు చేస్తోంది. అసంఘటిత రంగంలో పని చేసే వాళ్లకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ అమలు జరుగుతోంది.
అసంఘటిత రంగంలో పని చేస్తూ 15,000 రూపాయల లోపు వేతనం ఉన్నవాళ్లు వయస్సును బట్టి నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల మధ్య చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కోసం ధరఖాస్తు చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. లబ్ధిదారులు జమ చేసే మొత్తానికి సమానంగా కేంద్రం అంతే మొత్తాన్ని ఖాతాలలో జమ చేస్తుంది. లబ్ధిదారులు మరణిస్తే వారికి బదులుగా వారి జీవిత భాగస్వామి పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.
అసంఘటిత రంగంలో పని చేసే ఎవరైనా ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వారికి 8 శాతం చొప్పున వడ్డీ జమవుతుంది. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ, ఎల్.ఐ.సీ కార్యాలయాల ద్వారా ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…
స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…
రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…