Political analyst Rajesh Apapsani : గత ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగు దేశం పార్టీ వాడుకుందా…: పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని

Political Analyst Rajesh Appasani : నందమూరి వారసుడిగా సినీమాల్లో బాబాయ్ తరువాత మూడో తరం నుండి సినిమాల్లో సక్సెస్ అయిన జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీ కి దూరంగా ఉన్నాడా దూరం చేశారా వంటి విషయాలు ఎపుడు చర్చకు వస్తుంటాయి. 2009 ఎలక్షన్ టైములో టీడీపీ పార్టీ తరుపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత పార్టీ కార్యక్రమాలకు రాజకీయాలకు దూరం అయ్యాడు. అయితే చంద్రబాబు తరువాత టీడీపీ పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటాడా లేక లోకేష్ తీసుకుంటాడా అనే మీమాంస ఇప్పటివరకు కొనసాగినా యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ తన నాయకత్వం లక్షణాలను అలాగే తానే టీడీపీ నెక్స్ట్ లీడర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి రాకుండా చంద్రబాబు చేశాడంటూ చెప్పే మాటల్లో నిజమేంత అనే విషయాలను పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని వివరించారు.

ఎన్టీఆర్ ను టీడీపీ వాడుకోలేదు….

చంద్రబాబు నాయుడు కావాలనే తన కొడుకు కి పోటీ వస్తాడనే ఉదేశ్యం తో జూనియర్ ఎన్టీఆర్ ను పక్కకు తప్పించడని కొంతమంది చంద్రబాబు వ్యతిరేకులు మాట్లాడుతూ ఉంటారు. అయితే అందులో ఎటువంటి నిజం లేదని రాజేష్ అప్పసాని అభిప్రాయపడ్డారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికలకు ప్రచారం చేసాడు. ఆ తరువాత పార్టీ చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోవడం రాష్ట్ర విభజన ఇవన్నీ టీడీపీ క్యాడర్ ను దెబ్బతీసాయి. అలాంటి సమయంలో టీడీపీ పార్టీ ని చూసుకుంది కేవలం చంద్రబాబు, లోకేష్ మాత్రమే.

ఎన్టీఆర్ అపుడంతా ఎక్కడికి పోయాడు. ఇక రాజకీయాల్లో అడుగుపెట్టాలి అనే ఉద్దెశం ఉంటే క్రియశిలకంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలి. బాధ్యతలు స్వీకరించాలి అవేవి ఎన్టీఆర్ చేయలేదు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దెశం ప్రస్తుతం ఉన్నట్లు లేదు. తనకు సినిమాల్లో మంచి భవిష్యత్ ఉన్నపుడు అక్కడే తన కెరీర్ గురించి ప్లాన్ చేసుకుంటాడు కానీ రాజకీయాల్లోకి వచ్చి ఇబ్బందులు పడడు. ఇక ఎవరికీ సత్తా ఉంటే రాజకీయాల్లో వారు రాణిస్తారు అర్హత నాయకత్వాన్ని నిర్ణయిస్తుంది అంతే కానీ ఒకరిని ఇంకొకరు తొక్కేయడం వంటివి ఉండవు అంటూ రాజేష్ అప్పసాని అభిప్రాయపడ్డారు.