Postpartum Weight Loss: ప్రసవం తర్వాత బరువు తగ్గాలా?ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

Postpartum Weight Loss:తల్లి కావాలి అనేది ప్రతి మహిళ కల. గర్భధారణ దాల్చినప్పటి నుండి ఆరోగ్యం కోసం శరీరానికి అవసరమైన పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటారు. దీని వల్ల వారి శరీర బరువు పెరుగుతుంది. అయితే ఆ పెరిగిన బరువు కొంతమందిలో డెలివరీ అయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది.

డెలివరీ అయిన తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. సాధారణ ప్రసవం అయిన తర్వాత మహిళలకు శక్తి కోసం నెయ్యితో చేసిన లడ్డూలు కూడా పెట్టడం చూస్తుంటాం. ఇటువంటి పరిస్థితులలో వారు వారి నార్మల్ బాడీ వెయిట్ కి రావడం అంత సులువు కాదు. సిజెరియన్ అయిన మహిళల్లో పొట్ట వెలాడటం వంటివి చూస్తుంటాం. దీని వల్ల వారు మనస్తాపం చెందుతుంటారు. అయితే డెలివరీ అయిన తర్వాత కూడా మహిళలు వారి శరీర బరువును తగ్గించుకోవచ్చు, దానికి అనేక మార్గాలు ఉన్నాయి. వీటికోసం కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరి….

డెలివరీ తర్వాత కొన్ని నెలల వరకు వ్యాయామాలు చేయకూడదు అని డాక్టర్లు సలహా ఇస్తుంటారు, సిజేరియన్ అయిన వారికి ఇంకా జాగ్రత్త అవసరం. అయితే వాకింగ్ చేయవచ్చును. ఉదయం, రాత్రి వేళ తిన్న తర్వాత కొంచెం సేపు వాకింగ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.

పిల్లలకి తల్లి పాలు శ్రేయస్కరం అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య చాలా మంది వారి అందం తగ్గుతుంది అని బ్రెస్ట్ ఫీడ్ చేయడం లేదు. ఇలా ఆలోచించడం చాలా తప్పు. పిల్లల ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పాలు ఇవ్వడం వల్ల కూడా శరీర బరువు తగ్గుతుంది అని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఒక టేబుల్ స్పూన్ వామును ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని ఫిల్టర్ చేసి, గోరువెచ్చగా ఉన్న సమయంలో తాగాలి. దీనిని వాము నీరు అని అంటారు. ఇది మీ బరువుని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాక గ్యాస్, అజీర్తి సమస్యలు ఉన్న కూడా ఇది మంచి ఔషధం లాగా పని చేస్తుంది. దీనిని కనీసం రెండు పూటలా తాగాలి, లేదా రోజంతా అయిన తాగవచ్చు.

జాజికాయ పొడితో బరువు తగ్గవచ్చు..

జాజికాయ పాలు శరీర బరువును తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఒక కప్పు పాలలో పావు టీ స్పూన్ జాజికాయ పొడిని కలిపి వేడి చేసి, గోరు వెచ్చగా తాగాలి. ఇవే కాకుండా మీరు తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి.