General News

Girl Child: ఈ గ్రామంలో అమ్మాయి పుడితే చాలు..రూ.11,116 డబ్బులు మీ సొంతం!

Girl Child: రోజురోజుకు సమాజం ఎంతో అభివృద్ధి చెందుతూ పరుగులు తీస్తున్నా కొందరు మాత్రం పిల్లల పట్ల లింగ వివక్షత చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆడపిల్ల పుడితే బరువు అవుతుందని చదువుకోని వారు భావిస్తున్నప్పటికీ అమ్మాయి పుడితే రక్షణ కరువు అవుతుందని చదువుకున్నవారు కూడా ఆడపిల్లను పెంచి పెద్ద చేయాలంటే బరువుగా భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే చాలామంది అమ్మాయి పుడుతుందని తెలియగానే వారిని కడుపులోనే చిదిమేస్తున్నారు. మరికొందరు చెత్తకుప్పల పాలు చేస్తున్నారు. అయితే ప్రజల్లో మార్పు రావడం కోసం వారి ఆలోచన ధోరణి మార్చడం కోసం తెలంగాణ వనపర్తి జిల్లా, పెద్దమందడి మండలం, మద్దిగట్లకు చెందిన యువకులు సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు.

ఈ క్రమంలోనే ఆ గ్రామంలో నివసించే కొంతమంది యువకులు ఒక గ్రూపుగా ఏర్పడి ఆడపిల్లల పట్ల చూపిస్తున్న వివక్షతను ప్రతి ఒక్కరిలో తొలగించడం కోసం సరికొత్త ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే ఆ గ్రామంలో ఎవరికైతే ఆడపిల్ల పుడుతుందో వారికి ఈ యువకులు ఏకంగా రూ.11,116 డబ్బులను అందజేస్తున్నారు.

అభయ హస్తం పేరుతో సహాయం..

ఇలా ఈ గ్రామంలోని యువకులు ఇప్పటికే 19 మంది ఆడపిల్లలకు 2,11204 రూపాయలు డబ్బు అందజేశామని ఈ పథకానికి అభయహస్తం అనే పేరును పెట్టినట్లు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ గ్రామంలోని యువకులు కమిటీగా ఏర్పడి డబ్బును పోగు చేయడం కోసం ఏర్పాట్లు చేయగా వీరు చేస్తున్న మంచి పని అభినందిస్తూ కొందరు దాతలు వీరికి సహాయం చేస్తున్నారు.ఏది ఏమైనా ఆడపిల్లల సంరక్షణ కోసం ఈ గ్రామంలో యువకులు చేస్తున్న ఈ పని పై పలువురి ప్రశంసలు కురిపిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago