Prabhas: హీరోగా 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రభాస్.. ఊహించలేదంటూ కృష్ణంరాజు కామెంట్స్..!
Prabhas: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి నేటికి రెండు దశాబ్దాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా కృష్ణం రాజు ఇంట్లో సెలబ్రేషన్స్ జరిగాయి.
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మొదటి చిత్రం. 2002 జులై 28 వ తేదీన రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ‘ఈశ్వర్’ అనే సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమా మొదలై ఇప్పటికీ 20 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులతో పాటు ఈశ్వర్ సినిమా దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ. .. “ప్రభాస్ హీరోగా పరిచయం అయ్యి 20 ఏళ్ళు గడిచాయి అంటే నమ్మలేకపోతున్నాను. నిజానికి ప్రభాస్ ని మా గోపి కృష్ణ బ్యానర్ ద్వారా హీరోగా పరిచయం చేద్దామని అనుకున్నాం. కానీ ఒక రోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు.
ఈక్రమంలో ‘ఈశ్వర్’ సినిమా కథ విన్నప్పుడు ఈ సినిమా తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందని అనిపించింది. ఆ నమ్మకంతో సినిమా చేయటానికి ఒప్పుకున్నాను. జయంత్, అశోక్ ఇద్దరు కలిసి బాధ్యతగా తీసిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీలో ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా ద్వార ప్రభాస్ ఇండస్ట్రీలో మంచి హీరో అవుతాడు అనుకున్నా కానీ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యాడు అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో నటిస్తున్నాడు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…