Producer Avula Giri : సురేష్ బాబు సినిమాలు లేకుండా చేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు…: ప్రొడ్యూసర్ ఆవుల గిరి

Producer Avula Giri : డిస్ట్రిబ్యూటర్ గా ఖుషి, నరసింహనాయుడు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆవుల గిరి ఆపైన నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. శ్రీఆంజనేయం, కలుసుకోవాలని, నా అల్లుడు, ఆంధ్రవాలా, సై వంటి సినిమాలను నిర్మించిన ఆయన ప్రస్తుతం సినిమా నిర్మాణంకి, సినిమాలకు దూరంగా ఉన్నారు. వివాదాలకు దూరంగా సినిమాలను నిర్మిస్తు డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా ఏదిగిన ఆవుల గిరి కొన్ని కాంబినేషన్స్ ఎలా ఆగిపోయాయో ఇండస్ట్రీలో ఎలాంటి పాలిటిక్స్ జరుగుతాయో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

సురేష్ బాబు వార్నింగ్ ఇచ్చాడు…

ఆవుల గిరి సినిమాలను తీయకపోడాన్ని ఇండస్ట్రీకి దూరంగా జరగడానికి గల కారణాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబుతో మంచి సంబంధందాలు ఉండేవని తెలిపిన ఆయన వెంకటేష్ తో ఒక సినిమా చేయాలనే ఆలోచనతో శీను వైట్ల వెంకీ కాంబినేషన్ కోసం ట్రై చేసి, కథ రెడీ చేయడానికి స్క్రిప్ట్ కోసం డబ్బు ఖర్చు చేసి, కథ వెంకటేష్ కు వినిపించి అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటే ఆయన ఇంకొన్ని మార్పులు చెప్పి అంతా ఒకే అయ్యాక తీసుకుంటా అని చెప్పడం తో సురేష్ బాబు తోనూ మాట్లాడి కథ పనుల్లో ఉండగా ఒక పది రోజులు హాలిడేస్ కోసం పిల్లలతో బయటకి వెళ్ళి వచ్చేసరికి నిర్మాతగా ఇంకొకరి పేరు వినిపించింది. ఇద్దరు నిర్మాతలతో సినిమా అనగానే నేను వెళ్లి సురేష్ బాబు గారిని అడిగాను, సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యం అయినా ఒకే కానీ వేరే వాళ్లతో ఎందుకు, నేను ముందే చెప్పాను కదా నేనే చూసుకుంటా అని అడిగితే మాటా మాటా పెరిగి గొడవయింది.

అపుడే నువ్వు ఇండస్ట్రీలో మళ్ళీ సినిమా ఎలా తీస్తావో చూస్తా అంటూ ఛాలెంజ్ చేసారు. ఇక ఆ తరువాత నేను రామానాయుడు గారి వద్దకు వెళ్లి జరిగినది చెప్తే ఆయన నా చేతుల్లో ఇప్పుడు ఏమీ లేదు అని చెప్పేసారు. నాకు ఇక ఇండస్ట్రీ మీద అప్పటికే విరక్తితో ఉన్నాను, ఇచ్చిన మాటకు విలువ లేదని అర్థమై దూరం అయ్యాను. ఇక అప్పటికి పిల్లల చదువుల మీద దృష్టి పెట్టాలని అలోచించి ఇక సినిమాల వైపు రాలేదు. అయితే సురేష్ బాబు గారు కూడా సొంతంగా నిర్మించి సినిమాలను తీయలేదు. వేరేవాళ్లు తీసిన సినిమాలను కొనుక్కుని వాళ్ల పేరు వేసుకున్నారు అంటూ చెప్పారు.