Movie News

Actor Charan Raj : కాణిపాకం గుడిలోకి గన్ తీసుకెళ్లడంతో ప్రపంచానికి తెలిసిపోయాను…: నటుడు చరణ్ రాజ్

Actor Charan Raj : ‘ప్రతిఘటన’ సినిమాలో విలన్ కాళీగా నటించిన చరణ్ రాజ్ అప్పటి నుండి తెలుగు ప్రేక్షకులకు తెలుసు. కర్ణాటకకు చెందిన చరణ్ రాజ్ అసలు పేరు బ్రహ్మానంద్, ఆయన స్వస్థలం బెల్గాం. అయితే నటన మీద చిన్నప్పటి నుండి బాగా ఇంట్రస్ట్ ఉండటంతో ఇంట్లో చెప్పకుండా డబ్బు తీసుకుని బెంగళూరు వెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అలా ‘పరజిత’ అనే సినిమాలో మొదటగా హీరోగా చేసిన ఆయన ఆ సినిమా 100 రోజులు ఆడటంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ప్రతిఘటన సినిమా ద్వారా విలన్ గా పేరు తెచ్చుకోవడంతో చాలా సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన చరణ్ ఒకసారి మాత్రం గుడిలోకి గన్ తో వెళ్లి బాగా వైరల్ అయ్యారు. ఆ ఇష్యూ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

గన్ తో గుడికి వెళ్లడంతో ప్రపంచం మొత్తం తెలిసిపోయాను…

చరణ్ రాజ్ గారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో దీక్ష తీసుకుని కాణిపాకం వెళ్లడం అనవయితీగా పెట్టుకున్నారట. అలానే ఒకసారి వెళ్లగా అక్కడికి వెళ్ళాక బెల్ట్ కి ఉన్న రివాల్వర్ తీసేయడం మర్చిపోయి అలానే గుడిలోకి వెళ్లి పూజ చేయించి దీక్ష విరమించుకున్నాక అక్కడ కూర్చునే సమయంలో గన్ కనిపించడంతో మీడియా మొత్తం ఫోకస్ చేశారట. బయటికి వచ్చాక రూమ్ కి వెళ్ళాక స్నేహితులు ఫోన్ చేసి టీవీ 9 చూడమని చెప్పగా టీవీ చూడగానే గన్ తో చరణ్ రాజ్ గుడిలో అంటూ బ్రేకింగ్ వస్తోంది.

వినాయకునికి పూజ చేసానో లేదో ఒక్కసారిగా ఇండియా మొత్తం వైరల్ అయ్యాను. టీవీ 9 పుణ్యమా అని అంతవరకు తెలియని వాళ్లకు కూడా నేను తెలుసాను అంటూ చెప్పారు. నిజానికి నాతో లైసెన్స్డ్ రివాల్వర్ ఉంటుంది. ఇంతవరకు ఏ సినిమా ఆర్టిస్ట్ కి లేనట్టుగా నాకు ఐదు రాష్ట్రాలకు లైసెన్స్డ్ గన్ ఉంది. ప్రతిఘటన సినిమా తరువాత నాకు ఇచ్చారు. తమిళనాడు, కేరళ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఐదు రాష్ట్రాలకు కలిపి ఉంది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago