Amigos: ఇటీవల ‘ బింబిసారా ‘ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా ‘ అమిగోస్ ‘ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నందమూరి కుటుంబం నుండి ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత 2003లో వచ్చిన ‘ తొలిచూపులోనే ‘ అనే సినిమా ద్వారా హీరోగా మారాడు. ఆ తర్వాత అతనొక్కడే సినిమా ద్వారా మంచి హిట్ అందుకొని హీరోగా గుర్తింపు పొందాడు.
కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రమే మంచి హిట్ అందుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన బింబిసారా సినిమా ద్వారా కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక తాజాగా అమిగోస్ సినిమా కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే కళ్యాణ్ రామ్ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టడం ఇదే మొదటిసారి. గతంలో ఒక సినిమా హిట్ అయిన చాలా కాలం తర్వాత మరొక సినిమాతో హిట్ అందుకునేవాడు. కానీ ప్రస్తుతం మాత్రం బింబిసారా, అమిగోస్ సినిమాల ద్వారా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు.
ఇదిలా ఉండగా అమిగోస్ సినిమా విడుదలైన మొదటి రోజు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వినిపించింది. అయితే నిర్మాతలు దీనిని ఎలాగైనా హిట్ చేయాలని భావించి విడుదలైన మరుసటిరోజే ప్రెస్ మీట్ పెట్టి సినిమాకి హిట్ టాక్ వచ్చినట్లు ప్రచారం చేశారు.ఇలా ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా చూపుతున్నారు. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాలన్న కళ్యాణ్ రామ్ కల ఇన్నిరోజులకు నెరవేరింది.
ఈ మేరకు ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో కళ్యాణ్ రామ్ కూడా పాల్గొని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ” తాను ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు పూర్తి కావస్తోందని, హిట్ కొట్టి సంతోషించిన ప్రతీసారీ నెక్స్ట్ సినిమాలు హిట్ కాక తనను డిజప్పాయింట్.. చేసినట్టు చెప్పుకొచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడితే ఓ ఎనర్జీ వస్తుంది. బింబిసార తర్వాత అమిగోస్ రూపంలో ఆ ముచ్చట తీరిందని ” కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…