Subba Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి గుర్తింపు పొందారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన వారిలో నటుడు సుబ్బరాజు కూడా ఒకరు. ఖడ్గం సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుబ్బరాజు ఆ తర్వాత పోకిరి, ఖలేజా, దేశముదురు, మిర్చి వంటి ఎన్నో సినిమాలలో పాజిటివ్ నెగిటివ్ పాత్రలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందాడు.
ఇలా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన సుబ్బరాజు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుబ్బరాజు తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూలో ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నా మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని యాంకర్ ప్రశ్నించగా…సుబ్బరాజు మాట్లాడుతూ..” తనకి పెళ్లి చేసుకోవలసిన అవసరం రాలేదని అందువల్ల ఇప్పటికే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయానని చెప్పుకొచ్చాడు.
ఇక తన కుటుంబం గురించి మాట్లాడుతూ తన తండ్రి చాలా స్ట్రిక్ట్ అని సైకిల్ స్పీడ్ గా తొక్కినా కూడా ఎందుకు అంత స్పీడ్ గా తొక్కావని ప్రశ్నించేవాడని, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అని అడిగేవాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనకి మొహమాటం ఎక్కువని, అందుకే అవకాశాల కోసం డైరెక్టర్స్ ని అడగలేను అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తన వల్ల తన తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే డ్రగ్స్ కేసులో పలుమార్లు విచారణకు హాజరైన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ కేసు గురించి మాట్లాడుతూ… డ్రగ్స్ కేసులో చిక్కుకున్నప్పుడు తాను ఇబ్బందులకు గురయ్యానని తెలిపాడు. సమాజంలో నా పరువు పోతుందన్న బాధ కన్నా ఈ విషయం వల్ల తన తల్లితండ్రులు చాలా ఇబ్బంది పడతారనే బాధ తనకు ఎక్కువగా ఉండేదని తెలిపారు.ఈ కేసు విషయం తెలిసిన తర్వాత చాలామంది మా ఇంటికి వచ్చి మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో ఉన్నారట కదా అంటూ తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే వారిని సుబ్బరాజు వెల్లడించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…