రూ.లక్షకు 7 లక్షల రూపాయల లాభం.. ఎలా అంటే..?

మనలో చాలామంది సులభంగా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు సులభంగా సంపాదించడం సాధ్యమవుతుంది. అయితే షేర్ మార్కెట్ గురించి కనీస అవగాహన ఉంటే మాత్రమే డబ్బును సంపాదించవచ్చు. లేదంటే రిస్క్ ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు భారీమొత్తంలో నష్టాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

అమెరికా ఎన్నికల ఫలితాలు, కరోనా వ్యాక్సిన్ గురించి సానుకూల వార్తలు వస్తున్న నేపథ్యంలో మార్కెట్లు కొత్త రికార్డులను సృష్టిస్తూ ఉండటం గమనార్హం. టెక్స్‌టైల్ మ్యానుఫ్యాక్చరర్ అలోక్ ఇండస్ట్రీస్ షేర్ ఏకంగా 620 శాతానికి పరుగులు పెట్టింది. గతేడాది డిసెంబర్ లో ఇందులో మీరు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఏకంగా 7 లక్షల రూపాయలు మీ సొంతమై ఉండేవి. అదానీ గ్రీన్ షేర్ కూడా 12 నెలల కాలంలో ఏకంగా 550 శాతం పెరిగింది.

గతేడాది ఇదే సమయానికి 167 రూపాయలుగా ఉన్న షేరు ధర ప్రస్తుతం 1100 రూపాయలకు చేరింది. ఈ స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే కళ్లు చెదిరే లాభాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉండేది. ఈ సంవత్సరం లారస్ ల్యాబ్ స్టాక్ ధరలు కూడా పరుగులు పెట్టాయి. గ్రాన్యూల్స్ ఇండియా, అల్కైల్ అమైన్స్ షేర్లు ఏకంగా 200 శాతంపెరిగాయి. కరెక్ట్ స్టాక్ ను ఎంపిక చేసుకోవడంతో పాటు ఏ టైమ్ కు స్టాక్ నుంచి బయటకు రావాలో తెలుసుకుంటే అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవచ్చు.

ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ ను అర్థం చేసుకుని ఇతర అంశాలపై కొంత అవగాహనను కలిగి ఉంటే సులభంగా లాభాలను సొంతం చేసుకోవచ్చు. స్థిరమైన ఆదాయ వృద్ధిని నమోదు చేసే కంపెనీని ఎంచుకోవడంతో పాటు క్యాష్ ఫ్లో ఎక్కువగా ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకుంటే కళ్లు చెదిరే లాభాలు సొంతమవుతాయి.