Ramesh Reddy : 5 లక్షలు ఎగొట్టి బ్యాక్ డోర్ నుండి వెళ్ళాడు… విజయేంద్ర ప్రసాద్ గారు కథకి కార్ అన్నారు…: రమేష్ రెడ్డి

Ramesh Reddy : చలన చిత్ర పరిశ్రమలో రచయితగానే కాకుండా నటుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు రమేష్ రెడ్డి. ఏదైనా సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వినగానే ఆ సినిమా హిట్టో ఫట్టో చెప్పడం కారణంగా సినీ రంగంలో రెబల్ రమేష్ గా పేరు సంపాదించుకున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ తో ముందు నుంచి ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయనతో ఎక్కువ సినిమాలు చేశారు. అయితే రమేష్ గారు తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడంతో కొన్ని అవకాశాలు కూడా కోల్పోయానని, ఇక కొన్ని సినిమాలకి తనతో పని చేయించుకుని డబ్బులు ఎగొట్టడం కూడా జరిగిందని సినీ రంగంలో తన అనుభవాలను ఇలా చెప్పుకొచ్చారు.

కథకి కార్ అడిగిన విజయేంద్ర ప్రసాద్…

తన సినీ ప్రయాణంలో తనతో పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఉండటం చాలా సార్లు జరిగిందని, కానీ అలాంటి వాటి గురించి అస్సోసియేషన్ లో ఫిర్యాదు చేయడం, మీడియా ముందుకు రావడం ఎప్పుడూ చేయలేదని చెప్పాడు. తనకు డబ్బు కన్నా తను చేస్తున్న పని అంటే ఇష్టమని అందుకే ఎప్పుడూ గొడవలకు వెళ్లలేదని చెప్పుకొచ్చారు. అలా ఒక డైరెక్టర్ అయితే తను అప్పటికే రాయించుకుంటున్న రైటర్ పని నచ్చక నాకు అయిదు లక్షలు ఎక్కువ ఇస్తానని చెప్పి పని మొత్తం అయిపోయాక డబ్బులు ఇస్తానని వెనుక డోర్ నుండి చెన్నైకి పారిపోయాడని తనకు జరిగిన అనుభవాన్ని చెప్పారు.

ఇక విజయేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడుతూ మన కథకు మనమే గౌరవం ఇవ్వాలి అన్న ఆయన మాటను ఇప్పటికీ మర్చిపోలేనని తన అనుభవాని చెప్పుకొచ్చారు. రవిరాజా దగ్గర పనిచేస్తున్న సమయంలో విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పిన కథ బాగుంది అని అది వెంకటేష్ గారి సినిమా కోసం రవిరాజా గారికి ఇస్తానని అడగడం జరిగిందని, అప్పుడు ఆయన సరే ఇవ్వండి కథకు కార్ ఇవ్వమనండి అన్నారు. ఇంకా ప్రొడక్షన్ పనులు కూడా అవ్వలేదు అప్పుడే కార్ అంటే కష్టం అని నేను చెప్పగా కార్ నాకు కాదు నీకు కాదు కథకి, మన కథకి మనమే గౌరవం ఇవ్వాలి అని అన్నారు. అది ఇప్పటికీ నేను మరిచిపోలేని సంఘటన అని రమేష్ రెడ్డి చెప్పుకొచ్చారు.