Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక అనంతరం ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. తెలుగు తమిళ హిందీ భాషా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమా షూటింగ్ పనులతో ఏమాత్రం తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ విధంగా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
ఇకపోతే తాజాగా నటి రష్మిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా మనకు ఎవరైనా మూడ్ ఆఫ్ వచ్చిన, మనసు బాగా లేకపోయినా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాము. కానీ రష్మిక ఇందుకు పూర్తిగా భిన్నం అని తెలుస్తుంది.
ఈమె మనసు బాగా లేకపోయినా మూడ్ ఆఫ్ అయితే కనుక వెంటనే కిచెన్ లోకి దూరి ఏదో ఒక రెసిపీ తయారు చేసి అందరికీ వడ్డిస్తారట. ఇలా చేయడంతో తన మనసు తేలిక పడుతుందని రష్మిక ఒక సందర్భంలో తెలియజేశారు. ఇలా నలుగురికి భోజనం పెట్టడం వల్ల తన మనసు ప్రశాంతంగా ఉంటుందని ఈమె ఓ సందర్భంలో తెలియచేశారు. ప్రస్తుతం రష్మికకు సంబంధించిన ఈ వార్త వైరల్ కావడంతో మనసు బాగా లేకపోతే వంట చేయడం ఏంటి? అసలు ఇదేం అలవాటు రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…