Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు. ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి రష్మిక ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు పొందారు.
ఈ విధంగా రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రష్మిక బాలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ద్వారా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక తాజాగా అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ మ్యాగజైన్ సమస్త అయినటువంటి ఫోర్బ్స్ ఇండియా వెర్షన్ లో రష్మిక.. ప్రత్యేక ఆర్టికల్ ప్రచురించబడింది. ఇంకా..ఇండియాలో ప్రస్తుతం టాప్ పొజిషన్ కి ఎదుగుతున్న యువ వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలలతో పాటు సినిమా స్టార్స్ ను కూడా కలుపుకుని.. స్టార్స్ కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేక ఆర్టికల్ ని ప్రచురించింది.
మ్యాగజైన్ కవర్ పేజీ..
ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి రష్మికకు సంబంధించినటువంటి ఆర్టికల్ ప్రచురించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలా ఇలాంటి ప్రముఖ మ్యాగజైన్లు చోటు సంపాదించుకున్నటువంటి నటిగా రష్మిక గుర్తింపు పొందారు. అదేవిధంగా ఈమెతో పాటు ఇతర రంగాలలోని ప్రముఖులతో కలిసి దిగినటువంటి ఫోటో ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…