Rayalaseema: మహి వి రాఘవ పరిచయం అవసరం లేని పేరు.విలేజ్‌లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ, పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర, సిద్ధా లోకం ఎలా ఉంది, యాత్ర 2 సినిమాలను,అలాగే సేవ్ ది టైగర్స్,సైతాన్ వంటి వెబ్ సిరీస్ లో ద్వారా దర్శకుడిగా, నిర్మాతగా గుర్తింపు పొందిన ఈయన ఇటీవల యాత్ర2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
ఇటీవల ఈయన ఈ సినిమా చేసిన తర్వాత తనకు మదన పల్లెలో రెండు ఎకరాల స్థలం కావాలని ప్రభుత్వాన్ని కోరింది అయితే ఇదే విషయాన్ని ఓవర్గానికి చెందిన మీడియా వారు తప్పుగా ప్రచారం చేశారు. యాత్ర సినిమా చేశారు కనకే ఏపీ ప్రభుత్వం ఆయనకు రెండు ఎకరాల స్థలం ఇచ్చింది అంటూ తప్పుడు ప్రచారం చేశారు.
ఇలా తనకు ప్రభుత్వం రెండు ఎకరాలు స్థలం ఇచ్చింది అంటూ వచ్చిన వార్తలపై తాజాగా డైరెక్టర్ మహి వి రాఘవ్ స్పందించారు. తాను తన స్వప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని భూమి అడగలేదని తెలిపారు. ఇప్పటివరకు ఇండస్ట్రీ రాయలసీమకు ఎలాంటి సేవ చేయలేదు అలాంటిది రాయలసీమలో ఒక మినీ స్టూడియో ఉంటే ఆ పరిసర ప్రాంతాలలో షూటింగులు జరుపుకునే వారికి ప్రాథమిక సదుపాయాలు ఉంటాయన్న ఉద్దేశంతోనే తాను ప్రభుత్వానికి పొలం రెండు ఎకరాలు కావాలని వేడుకున్నానని తెలిపారు..
మినీ స్టూడియో కోసం..
అయితే ఈ విషయాన్ని ఓవర్గానికి చెందినవారు తప్పుగా ప్రచారం చేశారు. అయితే అదే వర్గానికి చెందిన వారికి కొన్ని వందల ఎకరాలు భూములను ప్రభుత్వం ఇచ్చింది నేను ఇలా వందల ఎకరాలు అడగలేదు కేవలం రెండు ఎకరాలు మాత్రమే అడిగాను. మా ప్రాంతంలో మినీ స్టూడియో ఉంటే షూటింగులు చేయడానికి వచ్చిన వారికి సదుపాయాలు ఉండటమే కాకుండా సమీప ప్రాంతాలలో ఉన్నవారికి ఉపాధి కల్పించినట్టు అవుతుందన్న ఒక ఉద్దేశంతోనే రెండు ఎకరాల పొలం అడిగాను అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…