Rithu Chowdary: రీతూ చౌదరి పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ సందడి చేసినటువంటి ఈమె అనంతరం పలు బుల్లి తెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. అయితే జబర్దస్త్ కార్యక్రమంలో కూడా సందడి చేయగా ఈ కార్యక్రమంతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
రీతు చౌదరి కెరియర్ విషయం పక్కన పెడితే ఈమె తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తలో నిలుస్తున్నారు. గతంలో శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని పరిచయం చేశారు. అయితే గత కొంతకాలంగా ఆయన గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురాకపోవడంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు కూడా హల్చల్ చేశాయి.
ఇలా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు రావడంతో ఈమె ఉన్న ఫలంగా తన ప్రియుడితో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటో వైరల్ గా మారడంతో తన గురించి వచ్చిన వార్తలు అవాస్తవమని తేలిపోయింది అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా పెళ్లి వీడియోని షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
ఏంటి రీతు చౌదరి ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారా అంటూ ఆశ్చర్యపోయారు. ఈ వీడియోలో భాగంగా ఈమె హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియో చూస్తే నిజంగానే ఈమె పెళ్లి చేసుకున్నారా అన్న సందేహాలు రాక మానదు కానీ ఈమె పెళ్లి చేసుకోలేదని ఒక షూటింగ్లో భాగంగా ఇలా పెళ్లికూతురుగా ముస్తాబయ్యారని తెలుస్తోంది. ఈ వీడియోని షేర్ చేసిన ఈమె ఆన్ స్క్రీన్ మ్యారేజ్ వెరీ క్రేజీ అంటూ కామెంట్ చేయడం గమనార్హం.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…