RRR నుంచి అందుకే తప్పుకున్నాం.. ఆ క్రెడిట్ రాజమౌళికే వెళ్తుంది.. : రామ్-లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్.

ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్.. వీరిద్దరూ తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా నుంచి తప్పుకోవడంపై ఒక యుట్యుబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సందర్బంగా దర్శకుడు రాజమౌళీపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేశారు. ఈ నేపధ్యంలో రాజమౌళి సినిమాలకు పనిచేసే టెక్నిషియన్స్ కి పెద్దగా పేరు రాదు అంటూ మాట్లాడి షాకిచ్చారు. అయితే రాజమౌళీ తన సినిమాలలో ఉండే ఫైట్స్ మరియూ యాక్షన్ సీన్స్ అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటారని.. ఆ సన్నివేశాలలో సుమారు 70 శాతం స్టంట్స్ స్వయంగా ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తాడని.. అందువల్ల ఆ సన్నివేశాలకు స్టంట్స్ తామే స్వయంగా చేసినా కూడా అసలు చేసిన ఫీలింగ్ ఉండదని రామ్-లక్ష్మణ్ తెలిపారు.

ఈ క్రమంలో మాట్లాడుతూ రాజమౌళి సినిమాల్లో ఏ ఫైట్ మాస్టర్స్ పనిచేసినా ఎవరికీ పెద్దగా రాదని.. క్రెడిట్ మొత్తం రాజమౌళికే వెళ్తుందని ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు. అయితే రాజమౌళి సినిమాలకు పని చేయాలంటే తాము ఎప్పడూ రెడీగా ఉంటామని.. కానీ రాజమౌళీతో సినిమా చేయాలంటే ఒకేసారి 40 నుండి 60 రోజుల వరకు డేట్స్ ఇవ్వాలని రామ్-లక్ష్మణ్ అన్నారు.

ఇవి కూడా చదవండి.. :-

ఇక ఒక్కసారి సినిమాకి కమిట్ అయితే.. ఆయన ఎప్పుడు అడిగితె అప్పుడు రెడీగా ఉండాలని.. టైమ్ లేదు, ఇప్పుడు కుదరదు అనే మాటలు ఆయనకు చెబితే నచ్చదని అన్నారు. అయితే డేట్స్ ఎక్కువగా అడ్జెస్ట్ చేయలేకపోవడం వల్ల తాము ‘బాహుబలి’, ‘ఆర్ఆర్’ సినిమాలకు పని చేయలేకపోయామని క్లారిటీ ఇచ్చారు. ‘RRR’ సినిమాలో కూడా పది రోజులు ఇంటర్వెల్ ఫైట్ ను చిత్రీకరించామని.. అయితే అనుకోకుండా హీరో రామ్ చరణ్ కు దెబ్బ తగలడంతో.. సినిమా షూటింగ్ నలభై రోజుల వరకూ ఆగిపోయిందని ఇక చేసేదేం లేక ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.