Shruthi Hassan: సౌత్ ఇండియన్ స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి శృతిహాసన్. ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో వరస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ట్రోల్స్ ఎదుర్కొన్నారు.
ఇలా తన గురించి ఎన్నో విమర్శలు వచ్చినా వెనకడుగు వేయకుండా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న శృతిహాసన్ తనకు వీలు దొరికినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఇటీవల అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేస్తూ ఉన్నటువంటి ఈమెకు నేటిజన్ల నుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మరోసారి పెళ్లి గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు. నెటిజన్ మీకు పెళ్లెప్పుడు అని అడిగిన ప్రశ్నకు రియాక్ట్ అవుతూ.. నేను చేసుకోను సార్ అని రిప్లై ఇచ్చింది.
నచ్చిన పని చేసుకోండి..
మీకు కాబోయే వారు ఎలా ఉండాలనుకుంటున్నారు అంటూ మరొకరు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ..ఇది 2024 అమ్మాయిలను ఇలాంటి ప్రశ్నలు అడగడం ఇకనైనా ఆపేయండి ఇవి చాలా సిల్లీగా అనిపిస్తున్నాయంటూ వివరించింది. అమ్మాయిలకు ఏది సంతోషం అనిపిస్తుందో దానిని చేసుకొనివ్వండి.ఇకపోతే గతంలో కూడా తనను రిలేషన్ షిప్ కి సంబంధించిన ప్రశ్నలు అడగొద్దని శృతి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…