ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా సెలబ్రెటీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు వీడియోలు వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అవుతున్నారు.ఈ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి క్రేజ్ సంపాదించుకున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునైనా ఒకరని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి ఎన్నో వీడియోలు చేసి ప్రేమపక్షులుగా పేరు సంపాదించారు. ఈ ఫాలోయింగ్ తోనే దీప్తి సునయన బిగ్ బాస్ రియాలిటీ షో లోకి అడుగుపెట్టి మరింత క్రేజ్ సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య ప్రేమ ప్రయాణం నడుస్తుందని ఎన్నో వార్తలు షికారు చేసినప్పటికీ ఆ వార్తలను ఖండించిన దాఖలాలు లేవు. అలాగని వారి మధ్య ప్రేమ ఉందని ఎప్పుడూ కూడా బయట పెట్టలేదు.కానీ వీరిద్దరి మధ్య ఉండే చనువు చూస్తే మాత్రం ఖచ్చితంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది.
కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే దీప్తి సునయన సోషల్ మీడియాలో సైతం పలు వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు. తాజాగా దీప్తి సునయన షేర్ చేసిన ఫోటో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మామూలుగానే దీప్తి సునయన భోజన ప్రియురాలు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ చేస్తూ అందరూ ప్రేమలో పడుతుంటే నేను మాత్రం ఈ భోజనం గోలలోనే ఉన్నాననే అర్థం వచ్చేటట్టుగా ఒక మీమ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ విధంగా మీమ్ షేర్ చేసిన దీప్తి సునయన తాను ప్రేమలో లేన్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఈ క్రమంలోనే దీప్తి సునయన షణ్ముఖ జశ్వంత్ మధ్య బ్రేకప్ జరిగిందా.. అందుకే దీప్తి ఇలాంటి ఫోటో షేర్ చేసిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…