తెలుగు గాయని సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన మృదువైన గాత్రం ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సునీతకు సోషల్ మీడియాలో కూడా అదే ఫాలోయింగ్ ఉంది.ఈమెకు కూడా అభిమానుల పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తుంటారు. ముఖ్యంగా సునీత సింగర్ ఫాన్స్ గురించి చెబుతూ సునీత అప్పుడప్పుడు ఎంతో ఎమోషనల్ అవుతుంటారు. ఈ క్రమంలోనే ఓ సారి ఇంస్టాగ్రామ్ లైవ్ లో ముచ్చటించిన సునీత సునీత సింగర్ ఫాన్స్(ఎస్ఎస్ఎఫ్)కి నా జీవితంలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని, నా ప్రాణంతో సమానం అని తెలిపారు.
ఈ విధంగా ఎస్ఎస్ఎఫ్ ద్వారా చేసే పలు పోస్టులు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని చెప్పవచ్చు. సునీతను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది తమ జీవితంలోకి ముందడుగు వేశారని, జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు, సునీత వల్ల సాయం పొందిన వారు తమ జీవితం గురించి తెలియజేస్తుంటారు. ఈ విధంగా ఓ అభిమాని సునీతను కదిలించే పోస్ట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ సందర్భంగా సునీత అభిమాని పోస్ట్ చేస్తూ..సునీత ఉపద్రష్ట.. ఓ స్పూర్తి ప్రధాత అంటూ ఎస్ఎస్ఎఫ్‌లో మెంబర్ అయిన ఇందిరా ప్రియదర్శిని అనే అమ్మాయి తన జీవితం గురించి, తన జీవితంలో సునీత పాత్ర గురించి చెప్పుకొచ్చారు. నాకు ప్రాణబిక్ష పెట్టిన దేవత సునీత గారు. ఆమె పాట మనసుకు ప్రశాంతత కల్పిస్తే ఆమె మాట మనిషికి ప్రాణం పోసింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ఆమెకు ఉన్న అలవాటు. ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం నాలో నింపి ఆత్మహత్య చేసుకోకుండా చేసింది. ఆమె పలకరింపు అప్పుడే పుట్టిన పసి పిల్ల నవ్వులా ఉంటుంది. ఆవిడ ఎంతో మందికి ఆదర్శం..ఆవిడ ఎంతోమందికి దైర్యం…ఆవిడ పాటలు ఎంతో మంది మనసుకు ప్రశాంతత.. ఆవిడ దేవుడు నాకు పంపిన బహుమతి అంటూ పోస్ట్ చేసింది. ఈ విధంగా అభిమాని చెప్పిన మాటలకు సునీత ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…