Samantha: కొత్త ఫ్రెండ్ తో పార్టీలు చేసుకుంటున్న సమంత.. వైరల్ అవుతున్న పొటోలు..!

Samantha:సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తరువాత కొద్ది రోజులపాటు ఆ బాధ నుంచి బయట పడటం కోసం తన స్నేహితులతో కలిసి విదేశీ ప్రయాణాలు తీర్థయాత్రలు చేస్తూ ఎంతో బిజీగా గడిపారు. ఇప్పుడిప్పుడే విడాకుల విషయం నుంచి బయట పడిన సమంత పూర్తిగా తన దృష్టిని సినిమాలపై పెట్టారు.

Samantha: నేను మాట్లాడే ముందు ఏమి ఆలోచించను..! అలా చేయడం నాకు ఇష్టం లేదు: సమంత

ఇలా సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంత బిజీగా ఉండటమే కాకుండా తరచూ స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ పార్టీలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త నెట్టిన వైరల్ గా మారుతున్నాయి.

Samantha: కొత్త స్నేహితులతో తరచూ పార్టీలు చేసుకుంటూ రచ్చ చేస్తున్న సమంత… ఫోటో వైరల్!

సమంత శాకుంతలం సినిమా డబ్బింగ్ పనులను పూర్తిచేసుకుని అనంతరం యశోద సినిమాతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం యశోద సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఇకపోతే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

సమంతకు దొరికిన కొత్త ఫ్రెండ్….

ఈ క్రమంలోనే సమంత వరలక్ష్మితో ఎంతో చనువుగా ఉంటూ తనతో కలిసి ఓ పార్టీకి వెళ్లారు. ఇక ఈ పార్టీలో భాగంగా సమంత స్టైలిస్ట్ నీరజ కూడా కనిపించింది. ఇలా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను సమంత ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.ఇదిలా ఉండగా తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ సమంత ఇద్దరూ కలిసి మరో పార్టీకి అటెండ్ అయినట్లు తెలుస్తోంది.ఇలా తరచు వీరిద్దరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉండడంతో ఎంతో మంది నెటిజన్లు సమంతకు కొత్త స్నేహితురాలు దొరికింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వీరి మధ్య చిగురించిన ఈ స్నేహం ఎప్పటి వరకు ఇలాగే కొనసాగుతుందో వేచి చూడాలి.