Samantha:సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తరువాత కొద్ది రోజులపాటు ఆ బాధ నుంచి బయట పడటం కోసం తన స్నేహితులతో కలిసి విదేశీ ప్రయాణాలు తీర్థయాత్రలు చేస్తూ ఎంతో బిజీగా గడిపారు. ఇప్పుడిప్పుడే విడాకుల విషయం నుంచి బయట పడిన సమంత పూర్తిగా తన దృష్టిని సినిమాలపై పెట్టారు.
ఇలా సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంత బిజీగా ఉండటమే కాకుండా తరచూ స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ పార్టీలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త నెట్టిన వైరల్ గా మారుతున్నాయి.
సమంత శాకుంతలం సినిమా డబ్బింగ్ పనులను పూర్తిచేసుకుని అనంతరం యశోద సినిమాతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం యశోద సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఇకపోతే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే సమంత వరలక్ష్మితో ఎంతో చనువుగా ఉంటూ తనతో కలిసి ఓ పార్టీకి వెళ్లారు. ఇక ఈ పార్టీలో భాగంగా సమంత స్టైలిస్ట్ నీరజ కూడా కనిపించింది. ఇలా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను సమంత ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.ఇదిలా ఉండగా తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ సమంత ఇద్దరూ కలిసి మరో పార్టీకి అటెండ్ అయినట్లు తెలుస్తోంది.ఇలా తరచు వీరిద్దరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉండడంతో ఎంతో మంది నెటిజన్లు సమంతకు కొత్త స్నేహితురాలు దొరికింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వీరి మధ్య చిగురించిన ఈ స్నేహం ఎప్పటి వరకు ఇలాగే కొనసాగుతుందో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…