Samyuktha Menon: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో విరూపాక్ష సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 21వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలకు చేరువయ్యింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండి హిట్ టాక్ తో దూసుకుపోతూ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. దీంతో చిత్ర బృందం ఫుల్ ఖుషీ లో ఉంది.
ఇదిలా ఉండగా విరూపాక్ష బ్యూటీ సంయుక్త మీనన్ తాజాగా దర్శకుడు కార్తీక్ దండుకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విరూపాక్ష సినిమా విడుదలైన తర్వాత సినిమా రెస్పాన్స్ గురించి తెలుసుకోవటానికి సినిమా యూనిట్ తో పాటు దర్శకుడు కార్తీక్ కూడా ప్రేక్షకులతో కలిసి థియేటర్ కి వెళ్ళగా అక్కడ అతని ఫోన్ ఎవరో దొంగలించినట్టు కార్తీక్ ఇటీవల తెలియజేశాడు.
ఇలా దర్శకుడు ఫోన్ పోగొట్టుకుపోవడంతో తనకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నటువంటి సంయుక్త అతనికి ఐఫోన్ ప్రో మోడల్ సెల్ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టు స్వయంగా వెల్లడించింది. సినిమా హిట్ అయిన సందర్భంగా దర్శకుడికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్న సందర్భంలో కార్తీక్ ఫోన్ దొంగలించబడింది. దీంతో సంయుక్త వెంటనే అతనికి ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేసినట్లు తెలిపింది.
కార్తీక్ ఫోన్ పోవడంతో సినిమా గురించి సోషల్ మీడియాలో ఎలాంటి రివ్యూస్ వస్తున్నాయో తెలుసుకోవటానికి యూనిట్ లో ఉన్న వారి మొబైల్ లో చూసేవాడని సంయుక్త తెలిపింది. ఇదిలా ఉండగా సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత నటించిన ఈ సినిమా మంచి హిట్టు అందుకోవడంతో సాయి ధరమ్ తేజ్ ఫుల్ హ్యాపీగా సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…