Senior Actor lakshmikanth : యాభై ఏళ్ల క్రితం వచ్చిన ‘కన్నెవయసు’ సినిమా, ఆ సినిమాలోని ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ పాటే. ఆ పాటలో నటించిన అనే కంటే జీవించిన నటుడు లక్ష్మి కాంత్ గారు. ఆయన ఆ సినిమా తరువాత చిలకమ్మ చెప్పింది, మంగళ్యానికి మరోముడి వంటి పలు సినిమాల్లో చేసినా ఆ పైన ఇండస్ట్రీ నుండి పక్కకు వచ్చేసారు. వ్యాపారాలను చేస్తూ బిజీ అయిన ఆయన మళ్ళీ చాలా ఏళ్లకు ఒక యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ కనిపించారు.
చిరంజీవి అపుడు ఎలా ఉండేవాడంటే…
లక్ష్మి కాంత్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలను ప్రయత్నించి చివరికి హీరోగా కన్నెవయసు సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. అలా తన కెరీర్ ప్రారంభించిన ఆయన అగ్ని సంస్కారం, కుక్కకాటుకు చెప్పు దెబ్బ, మంగళ్యానికి మరో ముడి, చిలకమ్మ చెప్పింది అంటూ పెద్ధ డైరెక్టర్లతో చాలా సినిమాలో హీరోగాను, హీరోయిన్ తమ్ముడిగా అలా కథ ప్రాముఖ్యం ఉన్న పాత్రలలో కనిపించారు. అయితే చిరంజీవి గారితో కలిసి అగ్ని సంస్కారం, కుక్క కాటుకు చెప్పు దెబ్బ వంటి సినిమాల్లో నటించిన లక్ష్మి కాంత్ గారు చిరు గురించి చెబుతూ అందరికీ గౌరవం ఇస్తూ ఉండేవాడు. అగ్ని సంస్కారం సినిమా సమయంలోనే అతనిలో మంచి స్పార్క్ ఉందనిపించేది.
ఇక కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమా సమయంలో ఇద్దరి కలయికలో కొన్ని సీన్స్ ఉండగా అందులో ఒక సన్నివేశంలో బైక్ లో నన్ను పిలుచుకుని వెళ్ళాలి అయితే తనకి బాలన్స్ చేయడానికి రాక పడేసాడు. ఇద్దరికీ దెబ్బలు తగిలాయి అంటూ చెప్పారు. ఇక సినిమాల్లో అవకాశాలు వచ్చినంత సేపు బాగానే ఉంటుంది. మెల్లగా అవకాశాలు తగ్గే సరికి ఒక డిప్రెషన్ లోకి వెళ్తాము. అలా ఉండకూడదు అని పక్కన వ్యాపారాలను మొదలు పెట్టాను. డబ్బింగ్ రైట్స్ తీసుకుని సినిమాలను డిస్టిబ్యూషన్ చేశాను. అలా కొన్ని చేసాక ఫోటో స్టూడియో కూడా పెట్టాము. ఇక సినిమాలలో అవకాశాలు తగ్గాక వద్దని బయట వ్యాపారాలను చూసుకున్నాను. అడపా దడపా అవకాశాలు బుల్లితెర వెండితెర మీద వచ్చినా ఆసక్తి లేక చేయలేదంటూ చెప్పారు.
ఎండలు తీవ్రంగా పెరుగుతున్న వేళ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో నీటితో పాటు ఆరోగ్యానికి మేలు…
ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో ఫ్రిజ్ వినియోగం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా చల్లని నీరు, ఐస్ క్యూబ్స్ లేకుండా చాలామందికి రోజు…
విఘ్నాలను తొలగించే దేవుడిగా గణపతికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యమైనా వినాయకుడి పూజతోనే ప్రారంభించడం ఆనవాయితీ.…
భారతీయ సంస్కృతిలో రామాయణానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీరాముడి జీవితం ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. త్రేతాయుగంలో జరిగిన ఈ మహాగాథతో…
కడప జిల్లాలోని జమ్మలమడుగు సమీపంలో వెలసిన నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. పెన్నా నది…
నేటి వేగవంతమైన జీవితంలో వెట్ వైప్స్ చాలా మందికి రోజువారీ అవసరంగా మారిపోయాయి. బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాల్లో లేదా మేకప్…