Categories: FeaturedMovie News

Senior Actor Raja : ఒకప్పటి నటుడు”రాజా”.. జూ.ఎన్టీఆర్ కి ఏమవుతారో తెలుసా.. పాపం చిన్న వయస్సులోనే స్వర్గస్తులయ్యారు.!!

సినీ పరిశ్రమలో ఒకే పేరుతో అనేక మంది నటీనటులు ఉండడం తెలిసిన విషయమే. రామారావు, సత్యనారాయణ, జయలలిత, బాలకృష్ణ, నరేష్, సుధాకర్.. ఇలా ఒకే పేరుతో అనేకమంది నటీనటులు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. నేడు ఆనంద్ రాజా అనే నటుడు కూడా ఉన్నారు. కానీ 1980లో ఒక రాజా ఉండేవాడు. ఈయన పేరు చెప్తే నాటి అమ్మాయిలు మత్తిక్కి పోయేవాళ్ళు. అలాంటి డ్రీమ్ బాయ్ అతడు.

రాజా ను దాసరి నారాయణరావు వెండితెరకు పరిచయం చేశాడు. ఈయన నటించిన “స్వప్న” చిత్రం ఆనాటి యూత్ ని ఒక ఊపు ఊపింది. 1980 శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్, దాసరి నారాయణరావు దర్శకత్వంలో “స్వప్న”చిత్రం విడుదలయ్యింది. స్వప్న అనే నటి ఈ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ప్రముఖ సంగీత దర్శకులు చెళ్లపిళ్ల సత్యం అందించిన “అంకితం నీకే అంకితం..నూరేళ్ళ ఈ జీవితం”.. అనే పాట ఎస్పీ బాలసుబ్రమణ్యం గొంతులో నుంచి జాలువారింది.ఈ గీతాన్ని స్వయంగా దాసరి నారాయణరావు రచించారు. ఆయన రాసిన అనేక గీతాల్లో ఈ పాటకు ఎంతగానో పేరు వచ్చింది. ఆనాటి ప్రేమికులను స్వప్న చిత్రం ఆకట్టుకుంది. అప్పటి స్టార్స్ ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు చిత్రాలతో పోటీపడి ఈ సినిమా ఘన విజయం సాధించింది.

నాటి ఎన్నో చిత్రాలలో రాజా యంగ్ హీరోగా నటించాడు. ఆ తర్వాత అప్పటి హీరోల చిత్రాలలో రాజా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో కూడా నటించారు. హఠాత్తుగా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో రాజా బుల్లితెరవైపు మొగ్గు చూపడం జరిగింది. ఆ క్రమంలో ప్రముఖ బుల్లితెర దర్శకురాలు మంజుల నాయుడు దర్శకత్వం వహించిన దూరదర్శన్ లో ప్రసారమైన “ఋతురాగాలు” ధారావాహికంలో రాజా లీడ్ యాక్టర్ గా చేశాడు. ప్రియసఖి, అన్వేషిత లాంటి సీరియల్స్ లో నటిస్తుండగా.. హఠాత్తుగా రాజా గుండెపోటుతో మరణించాడు. రాజా, ఏఎన్నార్ తో కలిసి దర్శకుడు వల్లభనేని జనార్ధన్ ఓ చిత్రం ప్రారంభించగ ఆయన మరణంవల్ల ఆ చిత్రం ఆగిపోయింది.

ఈయనకు ఎక్కువగా కన్నడ మూలాలు ఉన్నాయి. ఇక విషయానికి వస్తే నేటి జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి స్టార్ హీరోనో మన అందరికీ తెలిసిందే. ఈయన హరికృష్ణ రెండో భార్య షాలినికి జన్మించాడు. ఈమే ఓ ప్రముఖ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కంపెనీలో పని చేసేటప్పుడు హరికృష్ణతో పరిచయం ఏర్పడింది.
తర్వాత అది ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. మొదట్లో హరికృష్ణ తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ కూడా వీరి
వివాహాన్ని ఒప్పుకోకపోయినా ఆ తర్వాత షాలినిని తమ కోడలిగా, జూనియర్ ఎన్టీఆర్ ని మనవడిగా గుర్తించారు. సీనియర్ ఎన్టీఆర్ తన వృద్ధాప్యంలో జూనియర్ ఎన్టీఆర్ ని ఇంటికి పిలిపించుకోవటమే కాదు తన పేరునే తన మనవడికి పెట్టారు.

ఇక కర్ణాటకకు చెందిన శాలిని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. హైదరాబాద్ వచ్చిన మొదట్లో శాలిని నల్లకుంట “శంకర్ మఠం” వద్ద నివాసం ఉండేది. కొన్ని అనివార్య కారణాల వలన ఆమె తన కుటుంబంతో మెహేదీపట్నం లోకి మారిందని చెప్తారు. చాలాకాలం హరికృష్ణ శాలిని వివాహం రహస్యంగానే ఉండేది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని విషయానికొస్తే ఆమె నాటి రాజా హీరోకి దగ్గరి బంధువు. అంటే షాలిని సోదరిని రాజా వివాహం చేసుకున్నారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ కు బాబాయ్ అవుతాడు. ఒకవేళ రాజా బతికి ఉండి ఉంటే ఎన్టీఆర్ మరో స్థాయిలో ఉండేవారేమోనని అంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ నేటి ప్రముఖ దర్శకులు రూపొందించిన అనేక చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు. అలనాటి రాజా తెలుగు ప్రేక్షకులను విడిచి భౌతికంగా దూరమైనప్పటికీ బుల్లితెరలో ఆయన నటించిన సినిమాలు అప్పుడప్పుడు ప్రసారం కావడంతో ఇంకా ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా ఉండిపోయారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago