Murali Mohan : వ్యాపారం నుండి నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మురళీ మోహన్ గారు ‘జగమే మాయ’ సినిమాతో పరిచయమై అనతి కాలంలోనే హీరోగా అనేక చిత్రాల్లో నటించారు. ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన అటు పాలిటిక్స్ లోకి వచ్చి అక్కడ తనదైన ముద్ర వేశారు. ఇక సినిమా నిర్మాణంలో అడుగుపెట్టి జయభేరి బ్యానర్ స్థాపించి పలు చిత్రాలను నిర్మించిన ఆయన ఈ మద్య కాలంలో సినిమాలను తగ్గించినా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా రంగంలోని అనేక విషయాల గురించి అలాగే ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు.
నన్ను చంద్రబాబుకు బినామీ అని ఆరోపించారు…
హైదరాబాద్ కు సినిమా ఇండస్ట్రీ తరలి వచ్చాక సినిమాలు కాకుండా ఏదో ఒక వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో శోభన్ బాబు గారి సలహాతో రియల్ ఎస్టేట్ వైపు అడుగుపెట్టిన మురళీ మోహన్ గారు మాదాపూర్ ఇప్పుడున్న హైటెక్ సిటీ వద్ద ఆరు ఎకరాలు తీసుకొని వెంచర్ వేయాలని భావించారు. ఇక తెలుగుదేశంలో మారిన పరిస్థితుల కారణంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడంతో మురళీ మోహన్ గారు టీడీపీ లో చేరడం జరిగింది.
ఇక చంద్రబాబు సీఎం అయ్యాక చంద్రబాబు బినామీ మురళీ మోహన్ అంటూ విపక్షాల నుండి ఆరోపణలు వచ్చాయి. కోర్ట్ లో కేసులు కూడా వేశారట కొంతమంది ప్రతిపక్షాల వాళ్ళు. అయితే చంద్రబాబు కి నా భూమాలకు సంబంధం లేదని ఒకవేళ ఆరోపణలు నిజమైతే, భూముల కొనుగోలులో అక్రమాలు జరిగి ఉంటే ఖచ్చితంగా కోర్ట్ లో నిరూపించబడితే నేను అసెంబ్లీ వద్ద ఉన్న చెట్టుకే ఉరి వేసుకుంటా అంటూ మురళీ మోహన్ ఛాలెంజ్ కూడా చేసారట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…