Murali Mohan : వ్యాపారం నుండి సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన మురళి మోహన్ గారు ఏ ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎన్నో సినిమాల్లో నటించారు. ‘జగమే మాయ’ సినిమాతో అడుగుపెట్టిన ఆయన అనతి కాలంలోనే ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు స్టార్ డమ్ తెచ్చుకున్నారు. మా అసోసియేషన్ కి అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన అటు సినిమా రంగంలోనే కాకుండా ఇటు పాలిటిక్స్ లోకి వచ్చి తనదైన ముద్ర వేశారు. ఎంపీగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసారు. ఇక మరో వైపు వ్యాపారవేత్తగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ఇవన్నీ కాకుండ ఏంతో మంది పేద పిల్లలను చదివిస్తున్న మురళీ మోహన్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన జీవిత విశేషాలను తెలిపారు.
రియల్ ఎస్టేట్ లోకి అడుగుపెట్టడానికి కారణం… ఆ ఇద్దరి వల్ల మూతపడ్డాయి…
సినిమాల్లో సంపాదించినదంతా మళ్ళీ సినిమా నిర్మాణంలోకి పెడుతూ అలానే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిబ్యూషన్ లో కూడా అడుగుపెట్టారు. ఇది కాకుండా జయభేరి చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా సినిమాలను నిర్మించారు మురళీ మోహన్ గారు. అయితే శోభన్ బాబు గారు వ్యాపారంలో మంచి అనేది ఉండదు డిస్ట్రిబ్యూషన్ లో వాళ్ళు లాభాలు తీసుకుని నీకు ఇస్తారు అంతే కానీ అది నీకు ఇవ్వచ్చు లేదా నష్టాలు చూపించవచ్చు. ఇక సినిమా నిర్మాణంలోనూ లాభాలు ప్రతిసారి రావు భూమి మీద పెట్టుబడి పెట్టు అని సలహా ఇచ్చారట.
ఆయన చెప్పిన కొన్నిరోజులకే రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు మూతపడ్డాయి. అలానే అప్పులవాళ్లు రావడం అప్పటి వరకు సంపాదించినదంతా పోవడంతో, ఇక తమిళ సినిమా ‘ఇరువర్’ హక్కులు కొని తెలుగులో విడుదల చేస్తే అది ఫ్లాప్ అవడం ఇలా నష్టాలను చూసినపుడు శోభన్ బాబు గారు చెప్పింది నిజమని అర్థమైంది. అపుడు ఉన్న కొంత డబ్బుతో హైదరాబాద్ భూమి కొని రియల్ ఎస్టేట్ వైపు వచ్చాను అంటూ మురళీ మోహన్ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…