Shakunthalam film Story : సమంత ప్రధానపాత్రలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ శాకుంతలం. ఇటీవలే విడుదల అయిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఇందులో సమంతకు జోడిగా మలయాళం హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. శాకుంతలం సినిమా మహా కవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నుండి తీసుకున్న కథ. నీలిమ గుణ, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కథ ఏమిటా అనే ఆసక్తి ట్రైలర్ చూసిన వారిలో కలుగుతోంది. ఇక శాకుంతలం అసలు కథ గురించి తెలుసుకోడానికి ఆరాట పడుతున్నారు చాలా మంది ప్రేక్షకులు.
దుష్యంతుడు, శకుంతల అద్భుత ప్రేమ…
విశ్వామిత్రుడు ఒక యాగం చేస్తున్న సమయంలో అది చెడగొట్టడానికి భూలోకానికి వచ్చిన మేనక ఆయన ద్వారా ఒక బిడ్డకు జన్మనిస్తుంది, ఆ బిడ్డే శకుంతల. మేనక బిడ్డకు జన్మనిచ్చి అక్కడి నుండి స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది. విశ్వామిత్రుడు కూడా పట్టించుకోక వెళ్ళిపోతాడు. అనాధ అయిన శకుంతల కన్వ మహర్షి ఆశ్రమంలో పెరుగుతుంది. అయితే హస్తినాపురపు రాజైన దుష్యంతుడు వేటకోసం అడవికి వచ్చి శకుంతలను చూసి ఇష్టపడుతాడు. అదే సమయంలో కన్వ మహర్షి యాత్రలో ఉండటంతో శకుంతల దుష్యంతుడు గంధర్వ వివాహం చేసుకుంటారు. దుష్యంతుడు తిరిగి రాజ్యానికి వెళ్ళేటపుడు శకుంతలకు ఒక ఉంగరం మీది అక్షరాలు లెక్కబెట్టేలోపు వస్తానని వెళ్తాడు. అయితే శంకుంతల దుష్యంతుడి ఆలోచనలో పడి ఒకరోజున దూర్వస మహర్షి వచ్చిన సంగతి పట్టించుకోదు. దీంతో కోపగించుకుని మహర్షి నీవు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో వాళ్ళు నిన్ను మర్చిపోతారని శపిస్తాడు. దీంతో దుష్యంతుడు శకుంతల గురించి పూర్తిగా మర్చిపోతాడు. ఇక మహర్షి శాపం గురించి కూడా పట్టించుకోకుండా పరధ్యానంలో ఉంటే ఆమె చెలికత్తెలు మహర్షిని వేడుకొనగా జాలి పడి ఏదైనా వారిద్దరికీ సంబంధించిన వస్తువు చూపితే గుర్తు పడతారని చెప్పి వెళ్ళిపోతాడు.
ఎంతకీ దుష్యంతుడి నుండి పిలుపు రాకపోవడంతో, ఆశ్రమానికి వచ్చిన కన్వ మహర్షికి శకుంతల వివాహ గురించి తెలిసీ అత్తారింటికి పంపిస్తాడు. ఇక దుష్యంతుడి రాజ్యానికి వెళ్లిన శాకుంతల దారిలో నదిలో ఉంగరం చేజార్చుకుంటుంది. ఇక ఎంత చెప్పినా దుష్యంతుడు గుర్తుపట్టకపోవడంతో అటు అక్కడ ఉండలేక ఇటు ఆశ్రమానికి తిరిగిరాలేక ఇబ్బందిపడుతున్న సమయంలో తల్లి మేనక ఆమెను మరో ఆశ్రమానికి చేరుస్తుంది. ఇక శంకుంతలకు భరతుడు జన్మిస్తాడు. ఇటు నదిలోపడిన ఉంగరం ఒక చేప మింగడంతో ఆ చేప ఒక జాలేరికి దొరికి అలా ఉంగరం చివరికి రాజు దుస్యంతుడి వద్దకు చేరుతుంది. ఆ తరువాత మొత్తం గుర్తుకు వచ్చిన దుష్యంతుడు శకుంతల, భరతుడిని కలుసుకుంటాడు. ఇక ఈ కథలో లవ్, ఎమోషన్స్ బాగా పండుతాయి. మరి ఈ కథను గుణశేఖర్ దృశ్యకావ్యంగా ఎలా మలిచాడో ఫిబ్రవరి 17 దాకా ఎదురుచూడాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…