Featured

S.S. Rajamouli : రిచ్ డైరెక్టర్ గా జక్కన్న… సౌత్ నుండి ఒకేఒక్కడు…!

S.S. Rajamouli : ఓటమెరుగని దర్శకుడిగా మన జక్కన పేరు ఆల్ ఇండియా లెవెల్లో పాపులర్ అన్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు సినిమాకు 1000 కోట్ల మార్కెట్ రుచి చూపించి ప్రపంచ పటంలో తెలుగు సినిమాను పెట్టిన ఘనత మన రాజమౌళికే దక్కుతుంది. సీరియల్ తీసే రేంజ్ నుండి సిల్వర్ స్క్రీన్ ను దున్నెసే రేంజ్ కి వెళ్లిన జక్కన్న ఇప్పుడు మరో ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచం మొత్తం తన సినిమాల గురించి మాట్లాడుకునేలా చేసిన దర్శకధీరుడు ఇప్పుడు ఆల్ ఇండియాలో సౌత్ నుండి ఒకేఒక్కడిగా నిలిచి రికార్డు సృష్టించాడు.

టాప్ 10 లో చోటు దక్కించుకున్న జక్కన్న…

ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే డైరెక్టర్ శ్రమ అధికం. అందుకే వారికి పారితోషకం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలా ఇండియాలో టాప్ రిచ్ డైరెక్టర్ల గురించి ‘జీ క్యూ’ అనే సంస్థ సర్వే చేయగా అందులో మన జక్కన్న చోటు సంపాదించాడు. బాలీవుడ్ డైరెక్టర్స్ లో తాను సౌత్ నుండి నిలబడ్డాడు. ఇక లిస్ట్ గురించి చూస్తే మొదటి స్థానంలో బాలీవుడ్ బడా నిర్మాత, డైరెక్టర్ అయిన కరణ్ జోహార్ 1640 కోట్లను కలిగి అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కిచ్చుకున్నాడు.

ఇక రెండో స్థానంలో 1105 కోట్లతో రాజ్ కుమార్ హిరాని ఉండగా, మూడో స్థానంలో 940 కోట్లతో సంజయ్ లీలా భన్సాలి నిలబడ్డాడు. ఇక నాలుగోస్థానంలో 720 కోట్లతో అనురాగ్ కష్యప్, అలానే 300 కోట్లతో ఐదో స్థానంలో కబీర్ ఖాన్ ఉండగా ఆరో స్థానంలో 250 కోట్లతో రోహిత్ శెట్టి స్థానం సంపాదించాడు. ఇక ఏడవ స్థానంలో మన జక్కన్న 158 కోట్లతో రిచ్ డైరెక్టర్ గా స్థానం సంపాదించాడు. ఇక ఎనిమిదవ స్థానంలో 76 కోట్ల ఆస్తులతో జోయా అక్తర్ నిలిచారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago