Neha Pendse : ఒకప్పుడు సినిమాల్లో మెరిసి ప్రస్తుతం కనుమరుగై ఉన్న అందాల తారాలు ఎందరో ఉన్నారు. చేసింది ఒకటి అరా సినిమాలే అయినా ప్రేక్షకులకు మాత్రం గుర్తుండిపోతారు. అయితే ఆ ఒక్క సినిమా చేసేసి ప్రేక్షకులకు కనిపించకుండా వెళ్లిపోయిన తారలను మళ్ళీ ఇన్ని రోజులకు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో తెలుసుకోవాలని అభిమానులు ఆశ పడుతుంటారు. అలా ఒకప్పటి తెలుగు సినిమాల్లో తళుక్కున మెరిసి మాయమైన అందాల తార నేహా పెండ్సే.
నేహా ప్రస్తుతం చేస్తోందంటే…
నేహా పెండ్సే అనగానే గుర్తు రాకపోవచ్చు కానీ ‘సొంతం’ సినిమాలో రోహిత్ కి జోడిగా నటించిన హీరోయిన్ అనగానే గుర్తొస్తుంది. అమాయకపు నటనతో అప్పటి కుర్రకారును దోచుకున్న నేహా ఆ సినిమా తరువాత 2003 లో వచ్చిన ‘గోల్ మాల్’ 2008 లో వచ్చిన ‘వీధి రౌడీ’ సినిమాలలో కనిపించింధి ఈ ముంబై గుమ్మ. ఇక తెలుగులో పెద్దగా హిట్స్ లేకపోవడంతో అటు మలయాళం తమిళం, హిందీ, మరాఠి ఇలా చాలా భాషల్లో నటించినా అమ్మడికి హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ రాలేదు.
ఇక 2018 లో హిందీ బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 12 లో కుడా కనిపించింది. ప్రస్తుతం హిందీ సీరియల్స్ తో బిజీగా ఉన్న నేహా తన సోషల్ మీడియాలో కూడా ఫాన్స్ తో ఎపుడూ టచ్ లో ఉంది. ప్రస్తుతం ‘బాబిజీ ఘర్ పర్ హై’ సీరియల్ లో చేస్తున్న నేహా, అనిత విభూతి నారాయణ్ మిశ్ర పాత్రలో బాగా ఫేమస్. సీరియల్స్ తోను అటు ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతోను ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్న నేహా తెలుగులో మరిన్ని సినిమాలు చేసుంటే బాగుండేది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…