Featured

Anand Mahindra : వాళ్ళ స్టెప్పుల్లో అంత ఎనర్జి లేదు అయినా ఓకే… నాటు నాటు గురించి హాట్ కామెంట్స్ చేసిన ఆనంద్ మహేంద్ర…!

Anand Mahindra : ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. అందులోనూ జక్కన్న డైరెక్షన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన సినిమాను మరో రేంజ్ లో నిలబెట్టాయి. అయితే వారి కష్టానికి ఫలితంగా ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఇంతవరకు ఆసియన్ పాటకు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి. అదీ కాక మన ఇండియన్ సినిమా అందునా తెలుగు సినిమాకు రావడంతో అందరికీ ఈ అవార్డు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ పాట కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఆ కష్టానికి మంచి ఫలితం దక్కిందని చెప్పొచ్చు. గ్లోబల్ గా గుర్తింపు పొందిన ఈ పాటను గురించి వ్యాపార దిగ్గజం మహేంద్ర కారు కంపెనీ అధినేత ఆనంద్ మహేంద్ర ట్విట్టడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

అంత ఎనర్జీ లేదు… అయినా ఓకే…

ట్విట్టర్ వేదికగా ఏదో ఒక ఎమర్జింగ్ అంశం మీద మాట్లాడటం ముందు నుండి అలవాటుగా ఉన్న ఆనంద్ మహేంద్ర తాజాగా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట గురించి పోస్ట్ పెట్టారు. అందులో ఇలా రాసుకొచ్చారు… నాటు నాటు పాట తెలియని వారుండరు, ఈ వీడియోలోని ఈ పాత్రల్లో బ్రిటిష్ అమెరికన్ జంట లారేల్ – హార్డి డాన్స్ లో ఆర్ఆర్ఆర్ హీరోల్లో కనిపించినంత ఎనర్జీ ఉండదు అయినా పర్వాలేదు ఎంజాయ్ చేయండి అంటూ రెండు పాటలను పెట్టి పోస్ట్ చేసారు.

ఆయన పోస్ట్ కి రియాక్ట్ అవుతూ భారత బయో టెక్ ఏండి సుచిత్ర ఎల్లా కూడా నాటు నాటు పాట గురించి ఆనంద్ మహేంద్ర పోస్ట్ కి స్పందించారు. సంగీతం, నృత్యం, సంస్కృతి, భాష సినిమాలకు జాతీయ, అంతర్జాతీయ సరిహద్ధులు లేవు అని అప్పటి మూకీ సినిమాల నుండి ఇప్పటి సినిమాల వరకు నిరూపిస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడింది అంటూ ట్వీట్ చేసారు. దీన్ని బట్టి ఆర్ఆర్ఆర్ మేనియా, నాటు నాటు పాట క్రేజ్ ఎంత ఉందో అర్థమవుతుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

Bhargavi

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

11 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

11 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

11 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

11 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

11 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

12 hours ago