Sobhita: నాగచైతన్య హీరోగా అల్లు అరవింద్ నిర్మాణంలో చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్నటువంటి చిత్రం తండేల్. నాగచైతన్య సాయి పల్లవి జంటగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫిబ్రవరి 7వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అల్లు అరవింద్ శోభిత గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
నాగ చైతన్య శోభిత ఇటీవల వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితను ప్రేమించి డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక ఈ వివాహానికి అల్లు అరవింద్ కూడా హాజరైన విషయం మనకు తెలిసిందే.
ఇలా అల్లు అరవింద్ పెళ్లికి వెళ్లడంతో పెళ్లి పీటలపై కూర్చున్నటువంటి శోభిత అల్లు అరవింద్ ను ఒక చిన్న రిక్వెస్ట్ చేసింది అంటూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అల్లు అరవింద్ వెల్లడించారు. నేను పెళ్లి మండపం దగ్గరకు వెళ్ళగానే నాగచైతన్య తన భార్యకు నన్ను పరిచయం చేశారు. ఇలా పరిచయం చేయగానే శోభిత నన్ను ఒకటే కోరిక అడిగింది.
సర్ ఒక చిన్న రిక్వెస్ట్ నా భర్త ఫేస్ ని నాకు ఎప్పుడు చూపిస్తారు? ఈ గడ్డం వల్ల నా భర్త ఫేస్ ని నేను చూడలేకపోతున్నాను అని చెప్పింది. సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే మీ ఆయన ఫేస్ చూడొచ్చు అని చెప్పాను అంటూ తెలిపారు. ఈ సినిమా కోసం నాగచైతన్య గత కొంతకాలంగా మాస్ లుక్ లోనే కనిపిస్తున్నారు. దీంతో తన భర్తను స్టైలిష్ లుక్ లో చూడాలని శోభిత ఎంతో తహతహలాడిపోతున్నారని అందుకే తన భర్తను ఎప్పుడు స్టైలిష్ గా చూపిస్తారు అంటూ అల్లు అరవింద్ గారిని అడిగారనీ తెలియడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…
వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…
రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…
ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…