Social activist Krishna Kumari : నవంబర్ 15 తెల్లవారుజామున కృష్ణ గారు ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మరణించారు. ఇక ఆయన మరణానంతరం జరిగిన సంఘటనల గురించి చర్చ మొదలయింది. ముఖ్యంగా అన్నీ తానే అన్నట్లు నరేష్ ఉండటం, నరేష్ తో పాటు పవిత్ర లోకేష్ అక్కడే ఉండటం, కుటుంబ సభ్యురాలిలాగా అన్ని విషయాలనూ చూసుకోవడం వంటివి చాలా మందికి నచ్చక ఆమెను సోషల్ మీడియా వేదికగా తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే కృష్ణ గారిని కడసారి చూడటానికి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అక్కడికి రావడం, ఒక మూలాన కొడుకుతో కలిసి కూర్చోవడం అక్కడ పవిత్ర లోకేష్, నరేష్ ఉండటం అందరినీ ఆకర్శించింది. ఇక ఈ విషయాల మీద సామాజిక వేత్త కృష్ణ కుమారి ఆమె అభిప్రాయాలను పంచుకున్నారు.
కృష్ణ గారి అంత్యక్రియల సమయంలో ఏమిటా పనులు…
కృష్ణ కుమారి మాట్లాడుతూ కృష్ణ గారు మరణించిన వెంటనే ఆయన కుటుంబం ఆయనకు అత్యంత సన్నిహితులైన కొద్ది మంది హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడికి కూడా పవిత్ర లోకేష్ ను నరేష్ తీసుకెళ్లడం కుటుంబ సభ్యురాలిగా ఆమెను చూపించడం ఏమిటి అంటూ కృష్ణ కుమారి గారు అభిప్రాయపడ్డారు. ఇక కృష్ణ గారి పార్థివ దేహం వద్ద పవిత్ర లోకేష్ ఇంటి సభ్యురాలు అన్నట్లు వ్యవహరించడం, ఇక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అక్కడికి వచ్చినపుడు నరేష్ పవిత్ర లోకేష్ తో చేతులేసి మాట్లాడటం, రమ్య ఎక్కడో మూలన కూర్చొని ఉంటే పవిత్ర లోకేష్ ను ముందు వరుసలో బంధువుల మధ్యలో కూర్చోబెట్టడం, కళ్ళతోనే ఇద్దరూ మాట్లాడుకుంటూ చాలా సార్లు మీడియాలో ఫోకస్ అయ్యారు.
కళ్ళతో సైగలు చేసుకుంటూ నరేష్ తరచూ పవిత్ర వద్దకు రావడం మాట్లాడటం ఏమిటా పనులు, అక్కడ ఉన్నవాళ్లంతా చీదరించుకునేలా వారి ప్రవర్తన ఉంది. ఇక మహేష్ బాబు కి బాగా కోపం వచ్చినట్టు అతను వీళ్ళిద్దరినీ చూసిన తీరుకే తెలిసిపోతుంది. రమ్య రఘుపతితో విడాకులు తీసుకుని ఉంటే నువ్వు ఇంకో మహిళాతో అలా ఉన్నా నీ భార్య ముందు తప్పు లేదు కానీ విడాకులు ఇవ్వకముందే తన ముందు ఇంకో మహిళతో అలా ప్రవర్తించడం హర్షనీయం కాదు. రమ్య రఘుపతి ఈ విషయంలో కేసు పెట్టొచ్చు నరేష్ మీద ఇంకో మహిళతో నా ముందే తిరుగుతూ మానసికంగా వేధిస్తున్నాడని అంటూ కృష్ణ కుమారి గారు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…