Subbaraya Sharma : రంగనాథ్, జంధ్యాల, గుండు హనుమంతరావు మరణించడానికి కారణాలు అవే.. నిజాలు తెలుసుకొండి…: సుబ్బరాయ శర్మ

Subbaraya Sharma : నాటకరంగం నుండి సినిమాల్లోకి ఎందరో నటులు వచ్చారు. అలా నాటక రంగం నుండి సినిమాల్లో నటిస్తూ అలానే రేడియో రంగంలోనూ నాటికల ద్వారా పరిచయమై అలాగే బుల్లితెర మీద కూడా నటిస్తున్న వ్యక్తి ఉప్పలరి సుబ్బరాయశర్మ. నాలుగు రంగాల్లోనూ పనిచేస్తూ అలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆయన 200 పైగా సినిమాల్లో నటించారు. ఇక సినిమాల్లోనే కాకుండా చిన్నతనం నుండే నాటకాలలో నటించిన ఆయన ఎల్ బి శ్రీరామ్ గారి ఒంటెద్దు బండి నాటకాన్ని వందసార్లు ప్రదర్శించి మెప్పించారు. ఇక నాటకాలకు ఆయన ఎన్నో అవార్డులు ఇక సీరియల్స్ లో నటనకు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

వాళ్ళు చనిపోడానికి అసలు కారణాలు అవే…

సుబ్బరాయ శర్మ గారితో మొదటి సినిమా నుండి కలిసి నటించిన వాళ్లలో గుండు హనుమంత రావు ఒకరు. ఆయనకు షుగర్ అలానే ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల మరణించారు. అయితే హాస్పిటల్ బిల్స్ ఎక్కువ అవడం వల్ల ఇబ్బందులు పడ్డారు. అయితే మరీ ఆర్థిక సమస్యలేమి లేవు ఆయన జాగ్రత్త పరుడు అంటూ తెలిపారు. ఇక రంగనాధ్ గారు చాలా మంచి మనిషి, ఆయనే ఎంతో మందికి మనల్ని మనం చంపుకునే హక్కు లేదు అంటూ చెప్పిన వ్యక్తి అలా ఆత్మహత్య చేసుకున్నాడంటే ఖచ్చితంగా అందుకు బలమైన కారణం ఉండి ఉంటుంది.

ఆయన భార్య అనారోగ్య సమస్యలతో అలాగే కాళ్ళు పడిపోవడంతో వీల్ చైర్ కి పరిమితమైన ఆమెను ఆయనే చూసుకునేవాడు. చివరకు ఆమె మరణించడంతో బాధలోకి వెళ్ళిపోయారు అంటూ చెప్పారు. ఇక జంధ్యాల గారు తాగే అలవాటు ఉండటం వల్ల మరణించారని చెప్పడం తప్పు, రాత్రి పగలు తేడా లేకుండా తాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్లంతా మరణించలేదే. ఆయనకు షుగర్ ఉండటం వల్ల కిడ్నీ పాడైంది అలా మరణించారు అంతే, నిజాలు తెలుసుకోకుండా తాగి తాగి మరణించారు అనడం కరెక్ట్ కాదు అంటూ చెప్పారు.