Hero Jagapathi Babu : కుటుంబం కథా చిత్రాల హీరోగా మంచి తెచ్చుకున్న జగపతి బాబు అప్పట్లో శోభన్ బాబు గా పేరు తెచ్చుకున్నాడు. ఇద్దరు హీరోయిన్లు, లేదా మొగుడు పెళ్ళాల కాన్సెప్ట్ తో సినిమా ఇలా మహిళా ప్రేక్షకులను ఎక్కువ సొంతం చేసుకున్న జగపతి బాబు ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోల్లా కాదు ముక్కుసూటిగా ఉన్నది మాట్లాడేస్తాడు. తన గురించైనా సరే లోపాలను చెప్తాడు. ఇక ఒకరిని పొగుడుతూ ఉండటం భజన చేయడం రాడు కాబట్టే ఇండస్ట్రీలో పెద్దగా నన్ను ఎవరూ పట్టించుకోలేదు అంటూ చెప్పే జగపతి బాబు తనకు ఉమెన్ అంటే ఇష్టం కానీ విమెనైజర్ కాదు అంటూ ఘాటుగా చెప్పేస్తాడు. 60 ఏట అడుగుపెట్టిన జగపతి బాబు గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన ఫ్యామిలీ గురించి అలాగే సినిమాల గురించి మాట్లాడారు.
నా కూతుర్లకు పెళ్లి చేసుకోవద్దని చెప్పాను…
ఏదైనా ఓపెన్ గా మాట్లాడే జగపతి బాబు గారు తన పెద్ధ కూతురు పెళ్లి విషయంలో తాను ఎదుర్కొన్న సంఘటనల గురించి మాట్లాడుతూ కులం అంటూ చాలా మంది గొడవ చేసారు. తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలి కానీ కులం అంటూ ఏంటి, మన అనేది పెళ్లి ప్రేమ దగ్గర కనిపిస్తుందా, మన ఇంట్లో పని చేయడానికి కులం చూడరు, మన అవసరాలకు కులం చూడరు అంటూ అభిప్రాయాపడ్డారు. ఇక పెద్ధ కూతురు పెళ్ళయింది. ఇక చిన్న కూతుకరికైతే ముందే చెప్పేసాను నేను అయితే సంబంధాలు చూసి పెళ్లి చేయను, నీకు ఇష్టమైతే ఎవరైనా నచ్చితే చెప్పు పెళ్లి చస్తా, నేనైతే పెళ్లి వద్దనే చెప్తాను.
ఈ పెళ్లి, పిల్లలు ఇలాంటి బాధ్యతలు అవసరం లేదు ప్రేమ ఉండాలి కానీ బాధ్యత కాదు అంటూ చెప్పారు. ఇక పెద్ధ కూతురు నేను పిల్లల్ని కనను అని చెప్పినపుడు కూడా అదే చెప్పాను, అది నీ ఇష్టం నీ ఛాయస్ నన్ను అడగడం ఏమిటి. మేము పిల్లల్ని కనమని చెబితే అది మా స్వార్థం అవుతుంది అది మీ ఇష్టం అంటూ చెప్పాను. తను నాకు పిల్లల్ని కనాలని లేదు పెట్స్ ని పెంచుకుంటా అని చెప్పింది నీ ఇష్టం అని చెప్పా. ఇది చాలా మందికి నచ్చక పోవచ్చు కానీ నేను మారను, ఇది నా వ్యక్తిగత విషయం, ఎవరినీ పాటించమని చెప్పను అంటూ చెప్పారు.
వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…
ఫుట్‌బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…
భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…
నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…