Akira Nandan -Gautham: ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేది. అయితే ప్రస్తుతం తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరింది.ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ కృష్ణ వంటి హీరోల తర్వాత వీరి వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్టీఆర్ మహేష్ బాబు వంటి వాళ్ళు ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు.
ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.ప్రస్తుతం మెగా నందమూరి ఘట్టమనేని, అల్లు కుటుంబాల నుంచి హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ మహేష్ బాబు వంటి హీరోలు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోలుగా పేరు సంపాదించుకున్నారు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి హీరోలు కూడా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇలా ఈ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందడంతో తెలుగు సినిమా ఖ్యాతి మరో స్థాయికి వెళ్ళిందని చెప్పాలి. అయితే ఈ హీరోల తర్వాత వీరి వారసులు ఇండస్ట్రీలోకి రావడం సర్వసాధారణం అయితే వచ్చే పదేళ్లలో ఇండస్ట్రీలో మరోతరం స్టార్ హీరోల హవా నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్, మహేష్ వారసుడు గౌతమ్ ఘట్టమనేని వారి చదువులను కొనసాగిస్తూ ప్రస్తుతం ఉన్నత చదువులతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగడం పక్క అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యూచర్ స్టార్ హీరోస్ అంటూ అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.హైదరాబాదులో జరిగిన ఫార్ములా ఈ రేస్ లో భాగంగా వీరిద్దరూ పాల్గొనడంతో వీరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…